Srikanth Odela : నాని ‘పారడైజ్’లో మెగాస్టార్? శ్రీకాంత్ ఓదెల మైండ్ బ్లోయింగ్ మల్టీవర్స్ ప్లాన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘దసరా’ లాంటి మాస్ బ్లాక్‌బస్టర్ తర్వాత నాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘పారడైజ్’. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా గురించి ఫిలిం నగర్ సర్కిల్స్‌లో ఒక సెన్సేషనల్ న్యూస్ హల్చల్ చేస్తోంది. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల టాలీవుడ్లో ఎవరూ ఊహించని ఒక భారీ మల్టీవర్స్‌కు తెరలేపుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. నాని సినిమా తర్వాత శ్రీకాంత్ ఓదెల తదుపరి చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవితో చేయనున్న సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు వినిపిస్తున్న లీక్ ఏంటంటే… ఈ రెండు సినిమాలకు ఒక స్ట్రాంగ్ ఇంటర్‌లింక్ ఉందట. ‘పారడైజ్’ సినిమా ముగిసే సమయానికి, క్లైమాక్స్‌లో మెగాస్టార్ చిరంజీవి సినిమాకు సంబంధించిన ఒక సాలిడ్ లీడ్ ఇవ్వబోతున్నట్లు సమాచారం. అంటే నాని సినిమాలోంచే చిరంజీవి క్యారెక్టర్ లేదా కథ పుట్టబోతోందన్నమాట! లోకేష్ కనగరాజ్ ‘LCU’ తరహాలోనే శ్రీకాంత్ ఓదెల కూడా తనదైన శైలిలో ఒక సినిమాటిక్ యూనివర్స్‌ను క్రియేట్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాలలో చర్చ జరుగుతోంది.
ట్విస్ట్‌లు ఇక్కడితోనే అయిపోలేదు. ‘పారడైజ్’ కథ కేవలం ఒక భాగంతో ముగిసిపోయేది కాదట. ఈ సినిమాకు ప్రీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సినిమా విడుదలయ్యాక వచ్చే రెస్పాన్స్ ఆధారంగా ఈ ప్రీక్వెల్ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించే యోచనలో సినిమా టీం ఉందట. ఒకవేళ ఇదే నిజమైతే.. నాని క్లైమాక్స్ ఇచ్చే హైప్, చిరంజీవి సినిమాపై అంచనాలను ఎక్కడికో తీసుకెళ్లిపోవడం ఖాయం. శ్రీకాంత్ ఓదెల ప్లాన్ చేస్తున్న ఈ మాస్టర్ మైండ్ గేమ్ టాలీవుడ్లో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి!
Also Read
- Akhil Akkineni : వంద కోట్ల క్లబ్లో అయ్యగారు.. అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్
- Srinivasa Mangapuram OTT: మహేష్ మేనల్లుడు డిజిటల్ ఎంట్రీ.. రిలీజ్ రోజే ఓటీటీ డీల్ ఫిక్స్ చేసుకున్న 'శ్రీనివాస మంగపురం'
- Jacqueline Fernandez: 62 ఏళ్ల కల్ట్ హారర్ థ్రిల్లర్ కు రీమేక్?.. జాక్వెలిన్‌కు మరో భారీ అవకాశం!
- Maharani Season 5: ఐదేళ్లుగా ఓటీటీని ఏలుతున్న పొలిటికల్ థ్రిల్లర్.. ఇప్పుడు ఐదో సీజన్‌కు కౌంట్‌డౌన్!
తాజావార్తలు
-
Indian Railways: RAC టికెట్‌కు పూర్తి ఛార్జీ ఎందుకు?.. అసలు కారణం చెప్పిన రైల్వే శాఖ
-
Cricket Legends: ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు.. ఈ ఐదుగురు స్పిన్నర్ల రికార్డు బద్దలు కొట్టడం అసాధ్యం!
-
Bihar Crime: బట్టలూడదీసి.. నగ్నంగా…! భర్తను లవర్‌తో కలిసి కడతేర్చిన భార్య ఎపిసోడ్లో ట్విస్ట్
-
MINI Cooper Convertible Stardust Edition: మినీ కూపర్ కన్వర్టిబుల్ స్టార్‌డస్ట్ ఎడిషన్ విడుదల.. ధర, ఫీచర్లు ఇవే!
-
Deputy CM Pawan Kalyan: సాగునీటి సంక్షోభంపై పవన్ సమీక్ష.. ప్రత్యామ్నాయ చర్యలకు ఆదేశాలు
ట్రెండింగ్
-
Ajinkya Rahane: అజింక్య అంటే ఓడిపోనివాడు.. కానీ క్రికెట్ ఎన్నో ఓటములను చూపించింది!
-
Ajinkya Rahane Retirement: అజింక్య రహానే రిటైర్మెంట్.. ఇకపై క్రికెట్ ఆడనంటూ భావోద్వేగ పోస్ట్!
-
Vaibhav Sooryavanshi: నేను ఏ బౌలర్‌కు భయపడను.. వారే నన్ను చూసి వణికిపోతున్నారు!
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?