హీరో నాని చాలా కూల్ గా సింపుల్ గా పక్కింటి కుర్రాడిలా ఉంటాడు. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఫైర్ మోడ్ లో బీస్ట్ లా ఉంటాడు. ఇలాంటి రెండు వేరు వేరు ధృవాల్లాంటి నాని-సందీప్ రెడ్డి వంగ కలిస్తే ఆ కాంబినేషన్ ఫైర్ అండ్ వాటర్ లా ఉంటుంది. ఈ మాటని నిజం చేస్తూ నాని-సందీప్ రెడ్డి వంగ కలిసి ఇటీవలే ఒక ప్రమోషనల్ ఇంటర్వ్యూ చేసారు. ఆ ఇంటర్వ్యూ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. సందీప్ రెడ్డి వంగ… అనిమల్ లాంటి ఇంటెన్స్ సినిమా ఇస్తే సూపర్ పెర్ఫార్మెన్స్ ఇస్తా అంటూ నాని ఇటీవలే చెప్పుకొచ్చాడు. నానిలోని యాక్టర్ అంటే సందీప్ కి చాలా ఇష్టం కూడా. సో ఈ ఇద్దరు కలిసి సినిమా చేస్తే బాగుంటుందని సినీ అభిమానులు కోరుకుంటున్నారు.
నానిలోని వైల్డ్ యాక్టర్ ని సందీప్ రెడ్డి వంగ బయటకి తీసుకోని వస్తాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే సినిమా కన్నా ముందే ఈ ఇద్దరు మోస్ట్ టాలెంటెడ్ పీపుల్ ఒకే వేదికపైన బెస్ట్ యాక్టర్, బెస్ట్ డైరెక్టర్ అవార్డులు అందుకున్నారు. బిహైండ్ వుడ్స్ బెస్ట్ యాక్టర్ అవార్డుని నాని గెలుచుకున్నాడు. ఈ అవార్డుని సందీప్ నానికి అందించాడు. బెస్ట్ డైరెక్టర్ అవార్డుని సందీప్ రెడ్డి వంగ గెలుచుకోగా… ఈ అవార్డుని నాని సందీప్ కి అందించాడు. ప్రస్తుతం నాని-సందీప్ కలిసున్నా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అవార్డులు కాదు సినిమా చేయండి అంటూ నాని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నాడు. మరి ఒక సాలిడ్ సినిమాతో నాని-సందీప్ రెడ్డి వంగ ఆడియన్స్ ని థ్రిల్ చేస్తారేమో చూడాలి.