Nani: కూతురు కావాలంటున్న నాని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nani reveals his desire for a daughter recently: తాజాగా హీరో నాని తనకు ఒక కూతురు ఉంటే బాగుండు అనే కోరిక బయటపెట్టాడు. ఐదేళ్ల డేటింగ్ తర్వాత, 2012లో అంజనా యలవర్తి అనే అమ్మాయిని నాని పెద్దలను పెళ్లి చేసుకున్నారు. 2017లో వారికి మగబిడ్డ పుట్టగా జున్ను అనే పేరుతో ఇప్పటికే అభిమానులకు సైతం నాని పరిచయం చేశాడు కూడా. ఇక ఇప్పుడు తనకు కుమార్తె కావాలని కోరుకుంటున్నట్లు నాని పేర్కొన్నాడు. తాజాగా ఒక టీవీ న్యూస్ ఛానెల్ నిర్వహించిన తెలంగాణ రౌండ్ టేబుల్ 2023లో, నాని “హాయ్ నాన్నా” సినిమాలో తండ్రి పాత్రలో తాను నటించిన విషయం గురించి చర్చించారు. తాను అంతకుముందు తండ్రి పాత్ర కూడా పోషించానని అయితే తెరపై కుమార్తెకు తండ్రిగా నటించడం ఇదే మొదటిసారి అని ఆయన చెప్పుకొచ్చారు. “నేను ఒక కూతురికి తండ్రి కావాలని కోరుకుంటున్నాను, నేను ఒక కొడుకు తండ్రిని.
Samantha: ‘బజార్’ కోసం మళ్ళీ హద్దులు దాటేసిన సమంత
Also Read
- buchi babu: సినిమా హిట్ అయినా ఆ తప్పును ఒప్పుకున్న డైరెక్టర్ బుచ్చిబాబు..
- chiranjeevi: చిరంజీవి ఫోన్ కాల్‌తో షాక్ అయ్యా.. ‘పెద్ది’ సక్సెస్‌పై మెగాస్టార్ రియాక్షన్‌ను రివీల్ చేసిన బుచ్చిబాబు!
- Peddi Deleted Scenes: రావు రమేష్, జగపతి బాబు సీన్లను ఎడిటింగ్‌లో ఎందుకు లేపేశారో చెప్పిన బుచ్చిబాబు!
- 'Peddi': టాలీవుడ్ అంటే అంత అలుసా? 'పెద్ది' విషయంలో ఇండస్ట్రీ మౌనమేల?
ఇప్పుడు నా ఆన్ స్క్రీన్ రోల్ వల్ల కూతురికి తండ్రిగా అనుభవం వచ్చింది కాబట్టి కూతురు కావాలనే కోరిక మరింత పెరిగింది” అని ఆయన చెప్ప్పుకొచ్చాడు. ఆయన ఈ మేరకు కామెంట్ చేయడంతో నాని దంపతులు మరొక బిడ్డ గురించి ఆలోచిస్తున్నారా? అనే చర్చ కూడా మొదలైంది. అయితే నాని సినిమాల విషయానికి వస్తే నాని నటించిన “హాయ్ నాన్నా” డిసెంబర్ 7, 2023న విడుదల కానుంది, ఈ సినిమా తండ్రీకూతుళ్ల అనుబంధానికి సంబంధించిన సినిమా అని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. ఇక ఈ సినిమాలో బేబీ కియారా ఖన్నా నాని కూతురుగా నటించగా, మృణాల్ ఠాకూర్ అతని భార్యగా నటించింది. ఈ చిత్రంలో శృతి హాసన్ అతిథి పాత్రలో కనిపించనుందని టాక్ అయితే ఉంది. ఈ సినిమాను శౌర్య వ్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు.
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్‌కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!