NTV Telugu Site icon

Nani: కూతురు కావాలంటున్న నాని

Nani

Nani

Nani reveals his desire for a daughter recently: తాజాగా హీరో నాని తనకు ఒక కూతురు ఉంటే బాగుండు అనే కోరిక బయటపెట్టాడు. ఐదేళ్ల డేటింగ్ తర్వాత, 2012లో అంజనా యలవర్తి అనే అమ్మాయిని నాని పెద్దలను పెళ్లి చేసుకున్నారు. 2017లో వారికి మగబిడ్డ పుట్టగా జున్ను అనే పేరుతో ఇప్పటికే అభిమానులకు సైతం నాని పరిచయం చేశాడు కూడా. ఇక ఇప్పుడు తనకు కుమార్తె కావాలని కోరుకుంటున్నట్లు నాని పేర్కొన్నాడు. తాజాగా ఒక టీవీ న్యూస్ ఛానెల్ నిర్వహించిన తెలంగాణ రౌండ్ టేబుల్ 2023లో, నాని “హాయ్ నాన్నా” సినిమాలో తండ్రి పాత్రలో తాను నటించిన విషయం గురించి చర్చించారు. తాను అంతకుముందు తండ్రి పాత్ర కూడా పోషించానని అయితే తెరపై కుమార్తెకు తండ్రిగా నటించడం ఇదే మొదటిసారి అని ఆయన చెప్పుకొచ్చారు. “నేను ఒక కూతురికి తండ్రి కావాలని కోరుకుంటున్నాను, నేను ఒక కొడుకు తండ్రిని.

Samantha: ‘బజార్’ కోసం మళ్ళీ హద్దులు దాటేసిన సమంత

ఇప్పుడు నా ఆన్‌ స్క్రీన్ రోల్‌ వల్ల కూతురికి తండ్రిగా అనుభవం వచ్చింది కాబట్టి కూతురు కావాలనే కోరిక మరింత పెరిగింది” అని ఆయన చెప్ప్పుకొచ్చాడు. ఆయన ఈ మేరకు కామెంట్ చేయడంతో నాని దంపతులు మరొక బిడ్డ గురించి ఆలోచిస్తున్నారా? అనే చర్చ కూడా మొదలైంది. అయితే నాని సినిమాల విషయానికి వస్తే నాని నటించిన “హాయ్ నాన్నా” డిసెంబర్ 7, 2023న విడుదల కానుంది, ఈ సినిమా తండ్రీకూతుళ్ల అనుబంధానికి సంబంధించిన సినిమా అని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. ఇక ఈ సినిమాలో బేబీ కియారా ఖన్నా నాని కూతురుగా నటించగా, మృణాల్ ఠాకూర్ అతని భార్యగా నటించింది. ఈ చిత్రంలో శృతి హాసన్ అతిథి పాత్రలో కనిపించనుందని టాక్ అయితే ఉంది. ఈ సినిమాను శౌర్య వ్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు.

Show comments