Site icon NTV Telugu

Nani: హాయ్ నాన్న ఈవెంట్లో విజయ్-రష్మిక ఫోటో.. నాని ఏమన్నాడంటే?

Nani

Nani

Nani Responds on Vijay-Rashmika Mandanna Photo at Hi nanna Pre release Event: నేచురల్ స్టార్ నాని హీరోగా హోల్సమ్ ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘హాయ్ నాన్న’ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతోంది. శౌర్యువ్ దర్శకునిగా పరిచయం అవుతున్న ఈ సినిమా వైర ఎంటర్టైన్మెంట్స్ మొదటి ప్రొడక్షన్ వెంచర్‌ గా ఈ సినిమాను మోహన్ చెరుకూరి (CVM), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల భారీ ఎత్తున నిర్మించారు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బేబీ కియారా ఖన్నా కీలక పాత్రలో కనిపిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు ట్రెమండస్ రెస్పాన్స్ తో సినిమాపై భారీ అంచనాలని పెంచాయి. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘హాయ్ నాన్న’ డిసెంబర్ 7న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వైజాగ్ లో ఘనంగా జరిగింది. ఇక ఈ ఈవెంట్ లో ఒక పొరపాటు జరిగింది. అది పొరపాటునా.. ? లేక కావాలని హైప్ కోసం చేశారో ఏమో తెలియదు కానీ ఆ నింద మాత్రం నాని మీదకే వెళ్ళింది.

Sheela Rajkumar: భర్తకి విడాకులిచ్చిన మరో నటి.. థాంక్స్ చెప్పి మరీ?

అసలు విషయం ఏంటంటే హాయ్ నాన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాని, మృణాల్ కు కొన్ని ఫోటోలను చూపించి వారిద్దరిని క్యాప్షన్స్ చెప్పమని యాంకర్ సుమ కోరింది. అయితే విజయ్ దేవరకొండ, రష్మిక మాల్దీవ్స్ ఫొటోలను పక్కపక్కన వేసి చూపించారు. ఆ ఫోటోకి సుమ.. మృణాల్ ను క్యాప్షన్ అడిగితే ఆమె తడుముకుని తడుముకుని వెకేషన్ మోడ్ అంటూ చెప్పుకొచ్చింది. ఈ ఫోటోపై విజయ్- రష్మిక అభిమానులు మండిపడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఇక ఈ విషయం మీద నాని తాజా ఇంటర్వ్యూలో స్పందిస్తూ హాయ్ నాన్న ఈవెంట్ లో విజయ్-రష్మిక ఫోటో డిస్ ప్లే చేయడం అన్నది 200 మంది క్రూ లో ఎవరో చేసిన పొరపాటు అని కావాలని చేసింది కాదు అని అన్నారు. ఈ విషయం అస్సలు ఎక్స్ పెక్ట్ చేయలేదు, దాని గురించి ఇక ఎక్కువ మాట్లాడను అని నాని అన్నారు.

Exit mobile version