The Paradise Advance Bookings: నైజాంలో నాని మాస్ ర్యాంపేజ్.. గంటల్లోనే లక్ష టికెట్లు సేల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
The Paradise Advance Bookings: నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న ఊరమాస్ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’ (The Paradise) అడ్వాన్స్ బుకింగ్స్ నైజాం ఏరియాలో అల్టిమేట్ మాస్ ర్యాంపేజ్ సృష్టిస్తున్నాయి. నిన్న సాయంత్రం బుకింగ్స్ ఓపెన్ చేసిన కొద్ది గంటల్లోనే నైజాం వ్యాప్తంగా ఏకంగా 1 లక్షకు పైగా టికెట్లు అమ్ముడై సరికొత్త రికార్డు సృష్టించాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్ నైజాం హక్కులను మైత్రి మూవీ మేకర్స్ నాని కెరీర్లోనే హయ్యెస్ట్ రేటుకు దక్కించుకోగా, బుక్ మై షోలో హైదరాబాద్ లొకేషన్ పరిధిలోనే కేవలం కొన్ని గంటల్లో ₹1 కోటికి పైగా గ్రాస్ వసూలై బాక్సాఫీస్ వద్ద నాని హవా ఏంటో నిరూపిస్తోంది. ఈ సినిమాకు తెలంగాణ ప్రభుత్వం నుండి స్పెషల్ షోలు, టికెట్ హైక్ జీవో రావడంతో మేకర్స్ నైజాం చరిత్రలోనే ఒక తెలుగు సినిమాకు ఎన్నడూ లేని విధంగా అత్యధిక సంఖ్యలో షోలను ప్లాన్ చేశారు.
ఇందులో భాగంగానే సినిమా గ్రాండ్ రిలీజ్ కంటే ముందే, అనగా సెప్టెంబర్ 23న సాయంత్రం 6:30 గంటలకే నైజాం వ్యాప్తంగా భారీ ఎత్తున క్రేజీ అర్లీ ప్రీమియర్ షోలను ప్రదర్శిస్తున్నారు. 1980ల సికింద్రాబాద్ స్లమ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే పక్కా లోకల్ రూటెడ్ స్టోరీ కావడం, నాని ‘జడల్’ అనే సరికొత్త ఊరమాస్ పాత్రలో కనిపిస్తుండటంతో తెలంగాణ ఆడియన్స్ ఈ సినిమాను చూడటానికి థియేటర్లకు క్యూ కడుతున్నారు. నైజాంలోనే కాకుండా ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్‌లో కూడా ఈ సినిమా ఇప్పటికే $500K (హాఫ్ మిలియన్ డాలర్లు) మార్కును దాటి అంతర్జాతీయంగా కూడా రికార్డులు సృష్టిస్తోంది. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, దసరా కాంబినేషన్ రిపీట్ అవుతుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ బ్యూటిఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం రాబోయే 2026 సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో చాలా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది.
Also Read
- Lust Stories 3: భార్య అదితితో ఇంటిమేట్ సీన్స్.. కెమెరా ముందు అసలు ఏం జరిగిందో చెప్పిన సిద్ధార్థ్!
- Varanasi Update: ఫస్ట్ హాఫ్, ఇంటర్వెల్, క్లైమాక్స్.. 'వారణాసి'పై క్రేజీ అప్డేట్ వైరల్!
- Indian Cinema: 'బాహుబలి 2'ను కూడా వెనక్కి నెట్టిన పాత సినిమా.. 12 కోట్లకు పైగా టికెట్లు అమ్మి సరికొత్త రికార్డ్!
- Hanuman Ansh: ‘హనుమాన్ అంశ్’ను 15 సార్లు చూసిన నీమ్ కరోలి బాబా కుమార్తె.. ప్రతిసారీ కన్నీళ్లే..
ఇక ‘ది ప్యారడైజ్’ గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఈ రోజు (2026 సెప్టెంబర్ 21) సాయంత్రం 6:00 గంటల నుండి హైదరాబాద్‌లోని శిల్పకళా వేదిక లో జరగనుంది. చెన్నై, బెంగళూరు, కొచ్చి నగరాల్లో ప్రమోషన్లు ముగించుకున్న చిత్ర యూనిట్ ఈ రోజు హైదరాబాద్‌లో జరిగే ఈ భారీ వేడుకతో ప్రచార పర్వాన్ని ముగించనుండగా, అందుతున్న సమాచారం ప్రకారం, మెగాస్టార్ చిరంజీవి ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరై ఆశీర్వదించబోతున్నట్లు గట్టిగా ప్రచారం జరుగుతోంది.
కాగా ఈ సినిమాలో ప్రతినాయకుడైన ‘షికంజా మాలిక్’ పాత్రను మోహన్ బాబు నటిస్తుండగా, రాఘవ్ జుయాల్, తనికెళ్ల భరణి, సంపూర్ణేష్ బాబు, బాబు మోహన్, సోనాలి కులకర్ణి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కీర్తి సురేష్ కూడా ఏష నాగుల ఐటం సాంగ్ లో మెరవబోతున్నారు. ఇక సినిమా పై ఉన్న బజ్ ను బట్టి తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే షేర్ నాని కెరీర్ లోనే భారీ స్థాయిలో ఓపెనింగ్స్ రాబోతున్నాయని అంచనా ఉంది. ఇక సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే తొలి వీకెండ్లో ఆ నంబర్లు మరింత భారీగా పెరిగే ఛాన్స్ ఉంది. అన్నట్టు ‘ప్యారడైజ్’ సినిమాలో నాని క్యారెక్టర్, డైలాగులు చాలా బోల్డ్‌గా, ఊరమాస్‌గా ఉండబోతున్నాయట.
- Tags
- cinema
- The Paradise
తాజావార్తలు
-
IMD Weather Alert: దక్షిణాదిని ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. కేరళ, తెలంగాణ జిల్లాలకు ఐఎమ్‌డీ హై అలర్ట్
-
The Paradise Advance Bookings: నైజాంలో నాని మాస్ ర్యాంపేజ్.. గంటల్లోనే లక్ష టికెట్లు సేల్!
-
Sinchana Santosh: విద్యార్థిని సంచలనం.. 15 ఏళ్లకే పెట్టుబడులపై పట్టు.. రూ.13.9 లక్షల ఇన్వెస్ట్మెంట్ పోర్ట్‌ఫోలియో
-
Payal Mehta: జర్నలిస్ట్ పాయల్ మెహత మరణానికి అసలు కారణమేంటి?
-
Lust Stories 3: భార్య అదితితో ఇంటిమేట్ సీన్స్.. కెమెరా ముందు అసలు ఏం జరిగిందో చెప్పిన సిద్ధార్థ్!
ట్రెండింగ్
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!