NTV Telugu Site icon

Nani: అరే.. ఇదేం ప్రమోషన్స్ కాకా.. కేసీఆర్ నే ఇమిటేట్ చేస్తావ్ లే..

Nani

Nani

Nani: ఈ కాలంలో సినిమా ఎలాగైనా తీయనీ.. ఎంత ఖర్చు అయినా పెట్టనీ.. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా ఉండనీ.. ప్రమోషన్స్ సరిగ్గా చేయకపోతే మాత్రం ప్రేక్షకులు థియేటర్ వైపు ముఖం కూడా చూడడం లేదు. మా సినిమాలో కంటెంట్ ఉంది.. ప్రేక్షకులే వస్తారు అనుకోని ధైర్యంగా ప్రమోషన్స్ చేసుకోకుండా కూర్చుంటే.. ఖతం.. టాటా.. గుడ్ బై చెప్పేస్తున్నారు. అందుకే ఇప్పుడు అంతా సినిమా ఎలా ఉంది అనేది ముఖ్యం కాదు. ప్రమోషన్స్ ఎంత బాగా చేసారు అనేది ముఖ్యం. ఇక ఆ విషయాన్ని హీరో నాని తెలుసుకున్నాడు. ఎంత అయినా న్యాచురల్ స్టార్ కదా.. ప్రమోషన్స్ లో కూడా న్యాచురాలిటీని చూపిస్తూ అభిమానులను ఫిదా చేస్తున్నాడు. నాని, మృణాల్ ఠాకూర్ జంటగా శౌర్యవ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం హయ్ నాన్న. డిసెంబర్ 7 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన నాని.. ఇప్పుడు ట్రెండింగ్ లో ఏ అంశం అయితే ఉన్నదో దాంతోనే ప్రమోషన్స్ మొదలుపెట్టాడు.

Captain Miller: జింకను వేటాడే పులి కళ్లు ఎలా ఉంటాయో.. అలా ఉన్నాయి సామీ

తెలంగాణలో ప్రస్తుతం ఎలక్షన్స్ హీట్ నడుస్తున్న విషయం తెల్సిందే. ఇక ఎలక్షన్స్ నే నాని ప్రమోషన్స్ కోసం వాడేశాడు. ఈ మధ్యనే హయ్ నాన్న పార్టీ ప్రెసిడెంట్ గా ఎన్నికయిన విరాజ్ అని ఒక పోస్టర్ రిలీజ్ చేశాడు. అందులో తమకే ఓటు వెయ్యాలని తెలిపాడు. ఇక ఇప్పుడు ఒక అడుగు ముందుకు వేసి.. పార్టీ మీటింగ్ కూడా పెట్టేశాడు. అది కూడా అలా ఇలా కాదు.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నే ఇమిటేట్ చేస్తూ మాట్లాడాడు. కేసీఆర్ ప్రెస్ మీట్ లో రిపోర్టర్లతో ఎలా మాట్లాడుతారు.. ? ఎలా పంచ్ లు వేస్తారు.. ? అవన్నీ అచ్చు గుద్దినట్లు నాని ఇమిటేట్ చేశాడు. అక్కడ కేసీఆర్ ప్రజల గురించి మాట్లాడితే .. ఇక్కడ నాని తన సినిమా గురించి మాట్లాడాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. సూపర్ ప్రమోషన్స్ అని కొందరు. అరే.. ఇదేం ప్రమోషన్స్ కాకా.. కేసీఆర్ నే ఇమిటేట్ చేస్తావ్ లే.. అని ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ సినిమాతో నాని ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.