ప్రేమ కథా చిత్రాల్లో నాని నటించిన సినిమాలని సెపరేట్ చేసి చూడాలి. నాని సినిమాలు అంటూ లవ్ స్టోరీస్ కి ఒక సెపరేట్ జానర్ పెట్టాలి. ఎందుకంటే ప్రేమ కథల్లో నాని ఇచ్చే అన్ని వేరియేషన్స్, నాని చూపించే ఎమోషన్స్ ఇతర హీరోలు ప్రెజెంట్ చెయ్యలేరు. ఇప్పటికే ఎన్నో ప్రేమ కథా చిత్రాలని చేసిన నాని ఇంకో వంద డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ లో సెట్ చేసిన ప్రేమకథలు చేసినా ఆడియన్స్ చూస్తారు. లేటెస్ట్ గా నాని నుంచి వచ్చిన హాయ్ నాన్న మూవీ కూడా పైకి తండ్రి కూతురి ఎమోషన్ గా కనిపించినా సినిమా మొత్తాన్ని నడిపించింది మాత్రం హీరో-హీరోయిన్ మధ్య ఉండే లవ్ ఎమోషన్. నాని-మృణాల్ తన యాక్టింగ్ స్కిల్స్ తో తెరపై మ్యాజిక్ చేసి చూపించారు. సింపుల్ సీన్స్ ని కూడా అద్భుతంగా మార్చేసింది లీడ్ పెయిర్ యాక్టింగ్.
హాయ్ నాన్న సినిమా టాక్ బాగుంది, అన్ని సెంటర్స్ ఆడియన్స్ నుంచి… క్రిటిక్స్ నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. నాని సినిమాలకి ఎప్పుడూ ఎదురయ్యే సమస్యనే ఇప్పుడు హాయ్ నాన్న సినిమా కూడా ఫేస్ చేస్తుంది. నాని సినిమాలు టాక్ బాగుంటే బాక్సాఫీస్ గా డే 2, డే 3 నుంచి పుంజుకుంటాయి. డే 1 మాత్రం కాస్త అటుఇటుగానే కలెక్షన్స్ ఉంటాయి. దసరా సినిమా మాత్రం ఇందుకు మినహాయింపు… దసరా డే 1 నుంచే సాలిడ్ కలెక్షన్స్ ని రాబట్టింది. హాయ్ నాన్న మాత్రం డే 1 ఆశించిన స్థాయిలో కలెక్ట్ చేయలేకపోయింది. అనిమల్ సినిమా ఒక వైపు, రేవంత్ రెడ్డి ప్రమాణశ్వీకారం ఒకవైపు… హైప్ ఎక్కువగా క్రియేట్ చేయలేకపోవడం ఇంకో వైపు… ఇలా చాలా కారణాలు హాయ్ నాన్న సినిమా డే 1 కలెక్షన్స్ పై ఇంపాక్ట్ చూపించాయి. ఓవరాల్ గా హాయ్ నాన్న సినిమా ఆరున్నర కోట్ల వరకూ కలెక్ట్ చేసిందని ట్రేడ్ వర్గాలు ప్రిడిక్ట్ చేస్తున్నాయి. అన్ని సెంటర్స్ నుంచి ఫైనల్ కలెక్షన్స్ రిపోర్ట్ బయటకి వస్తే డే 1 ఫైనల్ ఫిగర్ తెలుస్తుంది.