Pawan kalyan Vs Nani : వేసవి లో రాబోతున్న నాని ‘దసరా’!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ ‘హరిహర వీరమ్లలు’ను వచ్చే యేడాది మార్చి 30న విడుదల చేయబోతున్నట్టు ఆ చిత్ర సమర్పకుడు ఎ.ఎం. రత్నం ఇటీవల తెలిపారు. చిత్రం ఏమంటే… సరిగ్గా అదే రోజున నానితో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ‘దసరా’ మూవీ కూడా భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ‘దసరా’ మూవీని నిర్మాత సుధాకర్ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేయాలనుకుంటున్నారు. మరి ఒకే రోజున తెలుగు నుండి రెండు పాన్ ఇండియా సినిమాలు విడుదల కావడం అంటే అది విశేషమే.
ఇక ‘దసరా’ మూవీ విషయానికి వస్తే… సినిమా రిలీజ్ డేట్ ను ఖరారు చేస్తూ చిత్ర బృందం శుక్రవారం ఓ పోస్టర్ ను విడుదల చేసింది. అందులో అలనాటి శృంగార తార సిల్క్ స్మిత పోస్టర్ ముందు నాని లుంగీ కట్టుకుని రగ్గడ్ లుక్ తో కనిపిస్తున్నారు. ఈ మూవీకి నాని అద్భుతమైన మేకోవర్ చేశారనేది ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ చూస్తే అర్థమౌతోంది. జాతీయ ఉత్తమ నటి కీర్తి సురేశ్ నాయికగా నటిస్తున్న ‘దసరా’లో సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. నాని ఫుల్ లెంగ్త్ మాస్, యాక్షన్-ప్యాక్డ్ పాత్రలో కనిపిస్తున్న ఈ చిత్రం గోదావరిఖనిలోని సింగరేణి కోల్ మైన్స్ దగ్గర ఉన్న ఒక గ్రామం నేపధ్యంలో జరుగుతుంది. దీనికి ఎడిటర్‌గా నవీన్ నూలి, ప్రొడక్షన్ డిజైనర్‌గా అవినాష్ కొల్లా, ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా విజయ్ చాగంటి వ్యవహరిస్తున్నారు. ఈ మూవీ కోసం గత నెలలో హైదరాబాద్ లో ఓ భారీ సెట్ వేసి షూటింగ్ చేశారు. దానికి ముందు షెడ్యూల్ లో స్టంట్ డైరెక్టర్ అన్బరీవ్ ఆధ్వర్యంలో భారీ యాక్షన్ ఎపిసోడ్‌ను తీశారు. అలానే నాని, కీర్తి సురేష్‌లపై ఓ భారీ పాట తెరకెక్కించారు. ‘ఆర్ఆర్ఆర్’లోని ‘నాటు నాటు’ పాట కొరియోగ్రఫీ అందించి యావత్ దేశాన్ని ఉర్రూతలూగించిన ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కొరియోగ్రఫీలో 500 మంది డ్యాన్సర్లతో పాటని అద్భుతంగా చిత్రీకరించారు. ఇలా ఓ విభిన్నమైన చిత్రంగా ‘దసరా’ మార్చి 30న జనం ముందుకు రాబోతోంది.
Also Read
- O Andala Rakshasi: థియేటర్లు ఇవ్వడం లేదు.. తొక్కిపెడితే ఊరుకోం.. ఆగ్రహం వ్యక్తం చేసిన హీరో!
- DTTTMovie : యంగ్ టైగర్ వస్తున్నాడు.. టికెట్స్ కోసం భారీ డిమాండ్
- Allu Arjun : నెవ్వర్ బిఫోర్ అవతార్స్‌లో అల్లు అర్జున్
- Balakrishna - Koratala Siva: కొరటాల మూవీలో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్.. ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు బాలయ్యలు!
తాజావార్తలు
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
-
Amaravati – Krishna River: అమరావతికి గుడ్‌న్యూస్.. కృష్ణా నది కరకట్ట పనులకు గ్రీన్ సిగ్నల్
-
H-1B Visa: భారతీయులకు గట్టి షాక్.. H-1B వీసా నిబంధనలపై తగ్గేదేలే అంటున్న అమెరికా..
-
O Andala Rakshasi: థియేటర్లు ఇవ్వడం లేదు.. తొక్కిపెడితే ఊరుకోం.. ఆగ్రహం వ్యక్తం చేసిన హీరో!
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
ట్రెండింగ్
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!