Geeta Madhuri: సింగర్ గీతా మాధురి విడాకులు.. నందు ఏమన్నాడంటే ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Geeta Madhuri: సెలబ్రిటీల ప్రేమలు, పెళ్లిళ్లు ఎలా ఉంటాయో అందరికీ తెల్సిందే. ఎప్పుడు ప్రేమలో పడతారో.. ఎప్పుడు విడిపోతారో వారికే తెలియదు. ఇక పెళ్లి తరువాత ఒక వారం కలిసి కనిపించకపోతే చాలు సోషల్ మీడియాలో వారు విడాకులు తీసుకున్నారు అనే వార్తలు గుప్పుమంటున్నాయి. కొంతమంది ఆ వార్తలను ఖండిస్తారు.. ఇంకొంతమంది చూసి నవ్వుకున్నామని చెప్పుకొస్తారు. తాజాగా సింగర్ గీతా మాధురి భర్త, నటుడు నందు కూడా ఇదే విషయాన్నీ చెప్పుకొచ్చాడు. గత కొన్ని రోజులుగా గీతా మాధురి, నందు మధ్య గొడవలు జరుగుతున్నాయని,వీరు విడిపోవడానికి సిద్ధంగా ఉన్నారని, ఇప్పటికే విడాకులకు కూడా అప్లై చేశారు అని వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ వార్తలపై నందు స్పందించాడు. ఈ మధ్యనే నందు.. మ్యాన్షన్ 24 అనే వెబ్ సిరీస్ లో లిల్లీ అనే పాత్రలో నటించాడు. ఓంకార్ దర్శకత్వం వహించిన ఈ హర్రర్ వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది.
Samantha: అబ్బే… అదంతా ఒట్టిదే అంటున్న సమంత!
Also Read
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
ఇక ఈ సిరీస్ ప్రమోషన్స్ కోసం చిత్ర బృందంతో పాటు నందు కూడా పాల్గొంటున్నాడు. తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో నందు తన విడాకుల రూమర్స్ గురించి మాట్లాడుతూ.. ” నేను, గీతా విడిపోయామంటూ వార్తలు వస్తున్న వాటిలో ఎలాంటి నిజం లేదు. మా ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవు. మేము సంతోషంగా ఉన్నాం. ఇలాంటి వార్తలు చూసి మేము ఇద్దరం నవ్వుకుంటాం. అలాంటివి అస్సలు పట్టించుకోము” అని చెప్పుకొచ్చాడు. దీంతో ఇవి కేవలం పుకార్లు అని తేలిపోవడంతో అభిమానులు సంతోషిస్తున్నారు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..