NTV Telugu Site icon

NandamuriTarakaRatna: శివరాత్రి రోజునే శివైక్యం చెందిన నందమూరి హీరో

Tarak

Tarak

Nandamuri TarakaRatna: 23 రోజులు.. 23 రోజులు మృత్యువుతో పోరాడి తారకరత్న ఆ శివుడి వద్దకే వెళ్లిపోయారు. నారా లోకేష్ పాదయాత్రలో గుండెపోటుతో కుప్పకూలిపోయిన తారకరత్న.. మళ్లీ తిరిగిరాలేదు. నందమూరి కుటుంబం, వైద్యులు ఎంతగా ప్రయత్నించినా తారకరత్నను కాపాడలేకపోయారు. ఎన్నో అనుమానాలు.. మరెన్నో ఆశలతో నందమూరి అభిమానులు ఆయన కళ్ళు తెరవాలని ప్రార్ధించారు. అయినా ఆ దేవుడు కనికరించలేదు. తారకరత్న కుప్ప కూలిన తరువాత ఆయన ఆరోగ్య సమస్యలు, వ్యక్తిగత విషయాలు అన్ని బయటికి వచ్చాయి. నిజం చెప్పాలంటే తారకరత్న గురించి ఆయన బెడ్ మీద ఉన్నప్పుడే అందరికి తెల్సింది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

Tarakaratna: బిగ్ బ్రేకింగ్.. చికిత్స పొందుతూ తారకరత్న మృతి

ఎంతో పుణ్యం చేసుకొని ఉంటే కానీ శివరాత్రి పండుగ రోజున శివునిలో ఐక్యమయ్యే అవకాశం రాదు అంటారు పెద్దలు. తారకరత్న ఎంత గొప్ప పుణ్యం చేసుకొని ఉంటాడో అని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. తారకరత్న తారక రత్న మృతదేహాన్ని రేపు ఉదయానికి మోకిలలోని తన నివాసానికి తరలించనున్నారు. సోమవారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు తెలుగు ఫిలిం ఛాంబర్ లో ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. సోమవారం సాయంత్రం ఐదు గంటలకి మహాప్రస్థానంలో అంత్యక్రియలు చేయనున్నట్లు తెలుస్తోంది. తారకరత్న మృతిపట్ల సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.