నందమూరి నట వారసులలో ఒకడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు నందమూరి తారకరత్న. 2002 లో ‘ఒకటో నెంబర్ కుర్రాడు’ సినిమాతో ఆయన తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న తారకరత్న.. ఈ సినిమా తరువాత వరుసగా 13 సినిమాలకు సైన్ చేసిన ఏకైక హీరోగా రికార్డ్ సాధించాడు. ఇక ఆ సినిమాల్లో కొన్ని అటకెక్కిన విషయం వేరే సంగతి.. ఇక హీరో నుంచి విలన్ గా మారాడు. అమరావతి చిత్రంలో విలన్ గా నటించి మెప్పించాడు. పోనీ అలా అయిన ఉండి ఉంటే ఈపాటికి నెంబర్ 1 విలన్ గా మారేవాడు.. హీరో, విలన్ అని కాకుండా కొన్నిరోజులు సినిమాలకు గ్యాప్ ఇచ్చాడు. ఇక ఇటీవల రిలీజ్ అయిన 9 అవర్స్ వెబ్ సిరీస్ తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఈ నేపథ్యంలోనే ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ నందమూరి ఫ్యామిలీ తనను దూరంపెట్టింది అని కొన్నిరోజుల నుంచి వస్తున్న వార్తలకు చెక్ పెట్టాడు. “నందమూరి ఫ్యామిలీ నన్ను దూరం పెట్టిందని అంతా అనుకుంటున్నారు.. కానీ అందులో ఎంతమాత్రం నిజం లేదు. నన్ను మొదటి నుంచి ఎలా చూసుకుంటున్నారో .. ఇప్పుడూ అలాగే చూసుకుంటున్నారు. ఎవరో ఏదో రాశారని చెప్పేసి ప్రతి విషయానికి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయమంతే. మా ఫ్యామిలీలో ఎలాంటి విభేదాలు లేవు.
మా తాతగారు మాకు నేర్పిన విలువలు మాకు తెలుసు.. మా ఆస్తుల గురించి,. ఆయన మాకు ఇచ్చిన వాటి గురించి మేమును గొడవలు పడుతుంటామని చెప్పుకుంటారు. అయితే అలాంటివేమీ మా మధ్య ఉండవు.. ఇక ఎన్టీఆర్ కి పోటీగా ఎంట్రీ ఇచ్చాను అని కూడా చాలామంది అంటారు. ఇప్పటికీ అది వినిపిస్తూనే ఉంటుంది. కానీ అందులో ఎంతమాత్రం నిజం లేదు. నాకు హీరో అవ్వాలని చిన్నప్పటినుంచి ఆశ.. అందువల్లే వచ్చాను.. మా ఫ్యామిలీలో నా కంటే ఎన్టీఆర్ ముందుకు వెళుతున్నాడనే ఫీలింగ్ ఎప్పుడూ లేదు. తను ముందుకు వెళ్లినా ఎన్టీఆర్ ఫ్యామిలీని ముందుకు తీసుకుని వెళుతున్నట్టే గదా. ఎన్టీఆర్ కు పోటీ నేనెప్పుడు కాదు.. కళ్యాణ్ రామ్, నేను, ఎన్టీఆర్ ఎప్పుడు కలిసినా సరదాగా మాట్లాడుకుంటాం.. మా అనుబంధాలు వేరు” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.