Nandamuri Mokshagna: బ్రేకింగ్.. అన్ స్టాపబుల్‌లో మోక్షజ్ఞ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nandamuri Mokshagna: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన తరుణం వచ్చేసింది. ఎట్టకేలకు NBK-PSPK కాంబో కుదిరిపోయింది. అసలు అవుతుందా లేదా అన్న అభిమానుల అనుమానాలు నిన్నటితో పటాపంచలు అయిపోయింది. మొట్ట మొదటిసారి నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో కు పవన్ కళ్యాణ్ గెస్ట్ గా వెళ్లారు. అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈ ఎపిసోడ్ షూట్ అంగరంగ వైభవంగా జరిగింది. అభిమానుల కేరింతల మధ్య పవన్ ను బాలయ్య సెట్ మీదకు తీసుకెళ్లడం జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారిన సంగతి కూడా తెల్సిందే.
ఇక ఈ ఎపిసోడ్ లో అభిమానులకు సర్‌ప్రైజ్‌ల మీద సర్‌ప్రైజ్‌లు ఇచ్చారు. మొదటి నుంచి పవన్‌తో త్రివిక్రమ్ వస్తారని ప్రచారం జరిగింది. కానీ సర్‌ప్రైజ్‌గా త్రివిక్రమ్ అలా వచ్చి ఇలా వెళ్ళిపోయాడు. ఆయన ప్లేస్‌లో దర్శకుడు క్రిష్ వచ్చాడు. వీరిద్దరితో బాలయ్య కొద్దిసేపు ఆటలాడించగా.. మరికొంతసేపటి తరువాత మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఎంట్రీ ఇచ్చాడు. ఇక మామాఅల్లుళ్ళతో బాలయ్య చేసిన సందడి అంతా ఇంతాకాదు. ఎపిసోడ్ మొత్తం ఫుల్ జోష్‌లో సాగింది. ఇక చివర్లో ఊహించని ట్విస్ట్.. నందమూరి నట వారసుడు మోక్షజ్ఞ గ్రాండ్ ఎంట్రీ అదిరిపోయింది. పవన్ ను కలిసి ఆయన ఆశీస్సులు తీసుకొని ఫోటో దిగడంతో ఈ ఎపిసోడ్ ముగిసింది. నిజం చెప్పాలంటే ఇలాంటి ట్విస్టులను ఎక్స్ పెక్ట్ చేయని అభిమానులు సడెన్ గా ఇంతమందిని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి కేరింతలు కొట్టారు. ఇక మోక్షజ్ఞ లుక్ అదిరిపోయింది. టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్దమవుతున్నట్లు కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
Also Read
తాజావార్తలు
-
Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
-
Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
-
Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
ట్రెండింగ్
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి