NTV Telugu Site icon

అరె… కళ్యాణ్ రామ్ కు ఆ విషయం తెలియదా!?

Kalyanram

Kalyanram

నటరత్న యన్టీఆర్ అంటే పౌరాణిక నటబ్రహ్మ అని పేరు. పురాణ పురుషుల పాత్రల్లో ఆయన జీవించిన తీరే వేరు. ప్రపంచంలోనే అత్యధిక పౌరాణిక చిత్రాల్లో నటించిన ఘనత నటరత్నదే! అలాంటి నటసార్వభౌముని పేరున వెలసిన బ్యానర్ ‘యన్.టి.ఆర్. ఆర్ట్స్’. ఆ పతాకంపై యన్టీఆర్ మనవడు కళ్యాణ్ రామ్ అనేక చిత్రాలు నిర్మించి, నటించారు. తాజాగా కళ్యాణ్ రామ్ ‘యన్టీఆర్ ఆర్ట్స్’ బ్యానర్ పైనే నటించి, నిర్మించిన చిత్రం ‘బింబిసార’ ట్రైలర్ సోమవారం (జూలై 4) సాయంత్రం విడుదలయింది. ‘బింబిసార’ ట్రైలర్ చూడగానే ఇట్టే ఆకట్టుకుంది. ఈ సినిమా ‘టైమ్ ట్రావెల్’ జానర్‌లో తెరకెక్కిందని నిర్మాత, హీరో కళ్యాణ్ రామ్ చెప్పారు. ఈ చిత్రం ద్వారా మల్లిడి వశిష్ఠ దర్శకునిగా పరిచయం అవుతున్నారు.

ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు వేసిన ఓ ప్రశ్నకు సమాధానంగా కళ్యాణ్ రామ్, “ఈ సినిమాను పూర్తి పౌరాణికం చేస్తే, రీసెంట్‌గా ‘బాహుబలి’ వచ్చింది. ఇక మేమేం చేయమంటారు?” అని సమాధానమిచ్చారు. ‘బాహుబలి’ సిరీస్ ఏ జానర్‌కు చెందిందో కూడా కళ్యాణ్ రామ్‌కు తెలియదా? ‘బాహుబలి’ పౌరాణికం ఎలా అవుతుంది? అది ఫక్తు జానపద చిత్రం అని అందరికీ తెలుసు. మరి పౌరాణిక నటబ్రహ్మ యన్టీఆర్ మనవడు అయి ఉండి, అదీ ఆయన పేరున బ్యానర్ పెట్టి ‘బింబిసార’ తీసిన కళ్యాణ్ రామ్‌కు ఆ మాత్రం తెలియదా? అంటూ విస్తుపోతున్నారు జనం.