NTV Telugu Site icon

Nandamuri Kalyan Ram: ఆమె లేకపోతే నేను లేను.. అందుకే ఆ టాటూ

Kalyan Ram

Kalyan Ram

Nandamuri Kalyan Ram: బింబిసార సినిమాతో మరోసారి ఫామ్ లోకి వచ్చాడు నందమూరి హీరో కళ్యాణ్ రామ్. ఈ సినిమా విజయంతో జోరు పెంచిన కళ్యాణ్ రామ్ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. రాజేందర్ రెడ్డి దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేసిన సినిమా అమిగోస్. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 10 న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా రిలీజ్ కు కొద్దిరోజులే ఉండడంతో ప్రమోషన్స్ జోరు పెంచిన చిత్ర బృందం వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ ఆసక్తికరమైన విషయాలను పంచుకుంటున్నారు. ఇక తాజాగా కళ్యాణ్ రామ్ ఒక యూట్యూబ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన భార్య గురించి అద్భుతంగా చెప్పుకొచ్చాడు. తన చేతిపై తన భార్య స్వాతి పేరు పచ్చబొట్టు వేయించుకోవడం వెనుక ఉన్న కథను మొదటిసారి తెలిపాడు.

Writer Padmabhushan: నిన్న మహేష్ నేడు రవితేజ.. ‘కలర్ ఫోటో’ హీరో దశ తిరిగినట్టే

ఎవరైనా తన లవర్ పేరు, తల్లి పేరు టాటూ వేయించుకుంటారు.. మీరు మీ భార్య పేరు టాటూ వేయించుకున్నారు.. మీది అరేంజ్డ్ మ్యారేజ్ కదా.. మీ భార్య పేరు చేతిపై వేయించుకొని అందరికి చూపిస్తూ ఉంటారు.. ఆ టాటూ వెనుక కథ ఏంటి అని యాంకర్ అడిగిన ప్రశ్నకు కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ.. “2007- 2008 మధ్య నాకు ఆరోగ్య సమస్యలు వచ్చాయి.. అవి మొత్తం ఇప్పుడు చెప్పడం ఇష్టం లేదు కానీ.. ఆరోగ్యం అస్సలు బాగోలేదు. అందరి భార్యలు అలాగే చేస్తారు.. కాదనడం లేదు. కానీ, నా విషయానికొస్తే.. సాధారణంగా నర్స్ లను పెట్టి.. చూసుకోమని చెప్పేస్తారు. కానీ, నా భార్య ఆ నర్స్ లను కూడా వద్దని చెప్పి.. తానే దగ్గర ఉండి చూసుకొంది. ఎందుకంటే తనకు నా గురించి అంతా తెలుసు. నిజంగా.. అమ్మ కొడుకును ఎలా చూసుకొంటుందో అలా చూసుకొంది. అది నా మనసుకు చాలా తాకింది. నాకు సూదులు అంటే చాలా భయం. ఇంజెక్షన్ కూడా చేయించుకోవడానికి భయపడతాను. మా పదవో పెళ్లి రోజున తనను అడిగాను.. నీకేం కావాలి.. ఏదైనా ఇస్తాను అని.. కానీ తాను మాత్రం నాకేం వద్దు.. అన్ని ఉన్నాయి.. పక్కన మీరు ఉన్నారు. పిల్లలు ఉన్నారు.. అది చాలు.. అని చెప్పింది. దాంతో నేను ఇది చేయాలనుకున్నాను. నాకు సూదులంటే భయం.. ఆ భయాన్ని ఆమె మీద ఉన్న ఇష్టం ఓవర్ కమ్ చేయించేలా ఈ టాటూ వేయించుకున్నాను.. ఆమె లేకపోతే నేను లేను” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Show comments