NTV Telugu Site icon

Kalyan Ram: ఎట్టకేలకు ‘బింబిసార 2’ అప్డేట్…

Kalyan Ram

Kalyan Ram

గతేడాది తెలుగు చిత్ర పరిశ్రమ క్రైసిస్ ని ఫేస్ చేసింది. ఆడియన్స్ ఏమో థియేటర్స్ కి రావట్లేదు, సినిమాల్లోనేమో కంటెంట్ ఉండట్లేదు, ఏపీ గవర్నమెంట్ టికెట్ రేట్స్ తగ్గించేసింది, ఓటీటీ హవా పెరుగుతోంది… ఇలా రకరకాల కారణాలు తెలుగు సినిమాని కొన్ని నెలల పాటు ఉక్కిరి బిక్కిరి చేసి పడేశాయి. దీంతో చేసేదేమి లేక నష్ట నివారణ చర్యలు చేపడుతూ షూటింగ్స్ కి కూడా ఆపేసే స్థాయికి ప్రొడ్యూసర్స్ వెళ్లిపోయారు. ఇలాంటి సమయంలో సరైన సినిమా రిలీజ్ అయితే ఆడియన్స్ థియేటర్స్ కి వస్తారు, బ్రేక్ ఈవెన్ అవుతుంది, ప్రాఫిట్స్ వస్తాయి అని నిరూపించిన సినిమా ‘బింబిసార’. కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ఈ డబుల్ బ్లాక్ బస్టర్ సినిమా కష్టాల్లో ఉన్న ఇండస్ట్రీకి ఊపిరి పోసింది. బింబిసారాతో పాటు రిలీజ్ అయిన సీతారామం సినిమా కూడా డబుల్ బ్లాక్ బస్టర్ అయ్యింది కానీ మాస్ లో బింబిసార సినిమాకి మరింత రీచ్ దక్కింది.

ఫాంటసీ డ్రామాగా, 40 కోట్ల బడ్జెట్‌తో కొత్త దర్శకుడు వశిష్ట డైరెక్ట్ చేసిన బింబిసార సినిమా కళ్యాణ్ రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఫస్ట్ సినిమానే అయినా గ్రాఫిక్స్ పరంగా.. బింబిసారను చాలా బాగా హ్యాండిల్ చేశాడు వశిష్ట. బింబిసార రిలీజ్ సమయంలోనే ఈ సినిమాకి సీక్వెల్‌ ఉంటుంది, ఒక ఫ్రాంచైజ్ లా సినిమాలు వస్తూ ఉంటాయి అని కళ్యాణ్ రామ్ కన్ఫామ్ చేశాడు. బింబిసార 2లో లేదా 3లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా నటిస్తాడని కళ్యాణ్ రామ్ చెప్పాడు. బింబిసార తర్వాత కళ్యాణ్ రామ్ తన సినిమాలతో బిజీ అయిపోయాడు కానీ బింబిసార 2 గురించి ఎలాంటి అప్డేట్ రాలేదు. లేటెస్ట్ గా బింబిసార 2 సినిమా గురించి ఒక రూమర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మొదటి పార్ట్ ని సూపర్బ్ గా డైరెక్ట్ చేసిన వశిష్ఠ, పార్ట్ 2 నుంచి తప్పుకున్నాడనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌తో కలిసి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ భారీ బడ్జెట్‌తో నిర్మించబోతున్నట్లుగా సమాచారం. వశిష్ట కథకి మాత్రమే పరిమితం అయ్యి దర్శకత్వ బాధ్యతలు మాత్రం ఇంకొకరి చేతికి అప్పగించినున్నట్లు తెలుస్తోంది. మరి ఈ రూమర్స్ ఎంతవరకూ నిజమేది తెలియాల్సి ఉంది.