NTV Telugu Site icon

Unstoppable 2: ముగ్గురు హీరోయిన్స్ తో బాలయ్య చేసిన సందడి చూసెయ్యండి

Unstoppable

Unstoppable

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న ‘అన్ స్టాపబుల్’ టాక్ షో సీజన్ 2కి చేరుకుంది. ఇప్పటికే ఈ సీజన్ లో అయిదు ఎపిసోడ్స్ బయటకి వచ్చి సూపర్బ్ వ్యూవర్షిప్ ని సొంతం చేసుకున్నాయి. బాలయ్యలో ఈజ్ చూసి ఇన్ని రోజులు మనం విన్నది ఈ బాలకృష్ణ గురించేనా అని అందరూ షాక్ అవుతున్నారు. చాలా సరదాగా, స్పాంటేనియస్ గా టాక్ షో చేస్తున్న బాలయ్య లేటెస్ట్ ఎపిసోడ్ లో ముగ్గురు హీరోయిన్స్ తో సందడి చేశాడు. వెటరన్ స్టార్ హీరోయిన్స్ అయిన ‘జయసుధ’, ‘జయప్రద’లతో పాటు యంగ్ హీరోయిన్ ‘రాశీ ఖన్నా’ అన్ స్టాపబుల్ సీజన్ ఎపిసోడ్ 6కి గెస్ట్ లుగా వచ్చారు. ఈ ఎపిసోడ్ ప్రోమో రీసెంట్ గా బయటకి వచ్చి ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసింది. ఫుల్ ఎపిసోడ్ చూసెయ్యండి అంటూ ఆహా ఎపిసోడ్ 6కి స్ట్రీమ్ చెయ్యడం స్టార్ట్ చేశారు. మోస్ట్ కలర్ ఫుల్ ఎపిసోడ్ గా రూపొందిన ఈ ఫన్ ఫిల్డ్ ఎపిసోడ్ ని మీరు కూడా చూసి ఎంజాయ్ చెయ్యండి.

ఇదిలా ఉంటే అన్ స్టాపబుల్ సీజన్ 2లో నెక్స్ట్ ఎపిసోడ్ కి ప్రభాస్ గెస్ట్ గా వస్తున్నాడు. డిసెంబర్ 30న ప్రీమియర్ కానున్న ఈ ఎపిసోడ్, అన్ స్టాపబుల్ కే బాహుబలి ఎపిసోడ్ లా పేరు తెచ్చుకుంది. ప్రభాస్ తో పాటు హీరో గోపీచంద్ కూడా గెస్ట్ గా రావడంతో డిసెంబర్ 30న ఆహా వ్యూవర్షిప్ పీక్ స్టేజ్ లో ఉండబోతుంది. ప్రభాస్ లోని ఫన్ టైమింగ్ ని బాలయ్య బయటకి తీసుకోని వచ్చాడు, ఒకప్పటి ప్రభాస్ ని చూసి ఎంజాయ్ చెయ్యండి అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ప్రభాస్ తన సినిమా ప్రమోషన్స్ కాకుండా ఒక షోకి వెళ్లడం ఇదే మొదటిసారి, పైగా ప్రభాస్ కి క్లోజ్ ఫ్రెండ్ అయిన గోపీచంద్ కూడా ఉంటాడు కాబట్టి అన్ స్టాపబుల్ ఎపిసోడ్ 7లో వింటేజ్ ప్రభాస్ ని చూసే ఛాన్స్ దొరుకుంతుంది.