Balayya: ‘శివన్న’ కోసం వస్తున్న ‘నటసింహం’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ నటించిన 125వ సినిమ ‘వేద’. ఇటివలే కన్నడలో రిలీజ్ అయిన ఈ మూవీ, అక్కడ డిసెంబర్ 23న కన్నడ ఆడియన్స్ ముందుకి వచ్చి మంచి విజయం సాదించింది. కన్నడ బాక్సాఫీస్ దగ్గర ఈ ‘రా, యాక్షన్ మూవీ’ మంచి కలెక్షన్స్ ని రాబట్టి శివన్న కెరీర్ మరో హిట్ సినిమాగా నిలిచింది. ‘గనవి లక్ష్మణ్’ హీరోయిన్ గా నటించిన వేద మూవీని శివన్న ప్రొడ్యూస్ చెయ్యగా ‘హర్ష’ డైరెక్ట్ చేశాడు. ఈ శివన్న బెంచ్ మార్క్ సినిమాను కంచి కామాక్షి కలకత్తా క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత వి.ఆర్.కృష్ణ మండపాటి ఫిబ్రవరి 9న తెలుగులో రిలీజ్ చేస్తున్నాడు. ఇటివలే వేద తెలుగు డబ్బింగ్ వర్షన్ కి సంబందించిన పోస్టర్, టీజర్, ట్రైలర్ లని లాంచ్ చేసిన తెలుగు డిస్ట్రిబ్యూటర్స్… ఈసారి నటసింహం నందమూరి బాలకృష్ణని రంగంలోకి దించారు. ఫిబ్రవరి 7న సాయంత్రం ఆరు గంటలకి దస్పల్లా హోటల్ లో వేద సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ జరుగుతుంది. ఈ ఈవెంట్ కి బాలకృష్ణ చీఫ్ గెస్ట్ గా వస్తున్నట్లు అఫీషియల్ అనౌన్స్మెంట్ బయటకి వచ్చేసింది.
శివన్న ఫ్యామిలీకి నందమూరి ఫ్యామిలీకి చాలా మంచి రిలేషన్స్ ఉన్నాయి. బాలయ్య నటించిన వందో సినిమా గౌతమీ పుత్ర శాతకర్ణీ సినిమాలో కూడా శివన్న ఒక పాటలో కనిపించాడు. కర్ణాటకలో నందమూరి, రాజ్ కుమార్ ఫామిలీస్ కి మ్యూచువల్ ఫాన్స్ ఉన్నారు. ఇటివలే పునీత్ చనిపోయినప్పుడు కూడా బాలయ్య, శివన్న ఇంటికి వెళ్లి మరీ పరామర్శించి వచ్చాడు. ఇంతమంచి బంధం ఉంది కాబట్టే శివన్న, తన వేద సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తుంటే సపోర్ట్ చెయ్యడానికి బాలయ్య వస్తున్నాడు. మరి బాలయ్య రావడం వేద సినిమాకి ఎంతవరకూ హెల్ప్ అవుతుందో చూడాలి. ఇదిలా ఉంటే వేద సినిమా కన్నడ వెర్షన్ ఫిబ్రవరి 7 నుంచి జీ5లో స్ట్రీమ్ అవుతుంది. ఈ ఒటీటీ స్ట్రీమింగ్ వేద సినిమా తెలుగు రిలీజ్ ని దెబ్బ తీస్తుందేమో చూడాలి.
Also Read
- The Paradise Collections: @200 కోట్లు లోడింగ్.. నెగిటివ్ టాక్‌ను తిప్పికొట్టి 'ది పారడైస్' బాక్సాఫీస్ జోరు మాములుగా లేదుగా..!
- EPIC : ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్న 'ఎపిక్'.. ఎప్పుడు ఎక్కడ చూడాలంటే?
- Allu Arjun-Boyapati: అల్లు అర్జున్-బోయపాటి కాంబోకు బ్రేక్.. అసలు కారణం ఇదేనా?
- Vishwambhara : మెగాస్టార్ 'విశ్వంభర' రిలీజ్ డేట్ లాక్?
తాజావార్తలు
-
Cash Withdrawal Surges: ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణలో కొత్త రికార్డు.. ఏకంగా రూ.2.24 లక్షల కోట్లు డ్రా!
-
APSRTC: ‘స్త్రీ శక్తి’లో చారిత్రాత్మక మైలురాయి.. 100 కోట్లు దాటిన ఉచిత ప్రయాణాలు
-
The Paradise Collections: @200 కోట్లు లోడింగ్.. నెగిటివ్ టాక్‌ను తిప్పికొట్టి ‘ది పారడైస్’ బాక్సాఫీస్ జోరు మాములుగా లేదుగా..!
-
Vaibhav Sooryavanshi: వెస్టిండీస్‌తో తొలి టీ20లో వైభవ్‌కు ఛాన్స్ ఉందా?.. మోర్నీ మోర్కెల్ సమాధానం ఇదే!
-
Chandrababu–Pawan Kalyan Meeting: చంద్రబాబు–పవన్ కల్యాణ్ భేటీలో కీలక నిర్ణయాలు.. స్థానిక ఎన్నికలపై ఫోకస్
ట్రెండింగ్
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!