Site icon NTV Telugu

Balayya: ‘శివన్న’ కోసం వస్తున్న ‘నటసింహం’

Balakrishna Shivanna

Balakrishna Shivanna

కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ నటించిన 125వ సినిమ ‘వేద’. ఇటివలే కన్నడలో రిలీజ్ అయిన ఈ మూవీ, అక్కడ డిసెంబర్ 23న కన్నడ ఆడియన్స్ ముందుకి వచ్చి మంచి విజయం సాదించింది. కన్నడ బాక్సాఫీస్ దగ్గర ఈ ‘రా, యాక్షన్ మూవీ’ మంచి కలెక్షన్స్ ని రాబట్టి శివన్న కెరీర్ మరో హిట్ సినిమాగా నిలిచింది. ‘గనవి లక్ష్మణ్’ హీరోయిన్ గా నటించిన వేద మూవీని శివన్న ప్రొడ్యూస్ చెయ్యగా ‘హర్ష’ డైరెక్ట్ చేశాడు. ఈ శివన్న బెంచ్ మార్క్ సినిమాను కంచి కామాక్షి కలకత్తా క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత వి.ఆర్.కృష్ణ మండపాటి ఫిబ్రవరి 9న తెలుగులో రిలీజ్ చేస్తున్నాడు. ఇటివలే వేద తెలుగు డబ్బింగ్ వర్షన్ కి సంబందించిన పోస్టర్, టీజర్, ట్రైలర్ లని లాంచ్ చేసిన తెలుగు డిస్ట్రిబ్యూటర్స్… ఈసారి నటసింహం నందమూరి బాలకృష్ణని రంగంలోకి దించారు. ఫిబ్రవరి 7న సాయంత్రం ఆరు గంటలకి దస్పల్లా హోటల్ లో వేద సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ జరుగుతుంది. ఈ ఈవెంట్ కి బాలకృష్ణ చీఫ్ గెస్ట్ గా వస్తున్నట్లు అఫీషియల్ అనౌన్స్మెంట్ బయటకి వచ్చేసింది.

శివన్న ఫ్యామిలీకి నందమూరి ఫ్యామిలీకి చాలా మంచి రిలేషన్స్ ఉన్నాయి. బాలయ్య నటించిన వందో సినిమా గౌతమీ పుత్ర శాతకర్ణీ సినిమాలో కూడా శివన్న ఒక పాటలో కనిపించాడు. కర్ణాటకలో నందమూరి, రాజ్ కుమార్ ఫామిలీస్ కి మ్యూచువల్ ఫాన్స్ ఉన్నారు. ఇటివలే పునీత్ చనిపోయినప్పుడు కూడా బాలయ్య, శివన్న ఇంటికి వెళ్లి మరీ పరామర్శించి వచ్చాడు. ఇంతమంచి బంధం ఉంది కాబట్టే శివన్న, తన వేద సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తుంటే సపోర్ట్ చెయ్యడానికి బాలయ్య వస్తున్నాడు. మరి బాలయ్య రావడం వేద సినిమాకి ఎంతవరకూ హెల్ప్ అవుతుందో చూడాలి. ఇదిలా ఉంటే వేద సినిమా కన్నడ వెర్షన్ ఫిబ్రవరి 7 నుంచి జీ5లో స్ట్రీమ్ అవుతుంది. ఈ ఒటీటీ స్ట్రీమింగ్ వేద సినిమా తెలుగు రిలీజ్ ని దెబ్బ తీస్తుందేమో చూడాలి.

Exit mobile version