NTV Telugu Site icon

Nandamuri Balakrishna:సెట్ లో శ్రీలీల చెంప పగలకొట్టిన బాలయ్య..

Bala

Bala

Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ కోపం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకు కోపం వచ్చిందంటే.. ఎదుట ఎవరు ఉన్నారు.. ఎక్కడ ఉన్నారు అనేది కూడా చూడడు. చెంప పగలకొట్టడమే. ఇప్పటివరకు చాలామంది అభిమానులు బాలయ్య చేతిలో దెబ్బలు తిన్నారు. అయితే అంత కొట్టినా.. బాలయ్య మీద ఎవరు ఆగ్రహం వ్యక్తం చేయరు. ఎందుకంటే పెట్టినా బాలయ్యే.. కొట్టినా బాలయ్యే కాబట్టి. అయితే తాజాగా బాలకృష్ణ.. హీరోయిన్ శ్రీలీల చెంప పగలకొట్టాడట. ఏంటీ.. నిజమా.. అంత తప్పు అమ్మడు ఏం చేసింది అని ప్రశ్నలు వేసేయకండి..ఎందుకంటే కొట్టడం నిజమే.. కానీ పర్సనల్ గాకాదు .. ఒక సన్నివేశం కోసం మాత్రమే. ప్రస్తుతం బాలయ్య.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో NBK108 తీస్తున్న విషయం తెల్సిందే. ఈ చిత్రంలో బాలయ్య కు కూతురుగా శ్రీలీల నటిస్తుంది.

Bandla Ganesh: గురూజీ విడకొట్టడంలో ఎక్స్ పర్ట్.. అంత పెద్ద మాట అనేశాడేంటీ

ఇక శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో ఒక యాక్షన్ సన్నివేశంను షూట్ చేస్తున్నారట. ఇందులో బాలయ్య, శ్రీలీల చెంప పగలకొట్టాలట. నార్మల్ గా చేయి తాకిస్తే.. సన్నివేశం బాగా రాదని శ్రీలీలనే బాలయ్యను గట్టిగా, ఒరిజినల్ గా కొట్టమని అడిగిందట. బాలయ్య వద్దు అని చెప్పినా అనిల్ కూడా ఓకే అనడంతో బాలయ్య శ్రీలీల చెంపపై గట్టిగా కొట్టేశాడట. ఆ దెబ్బకు రియాక్షన్ బాగా ఇచ్చిన తరువాత.. ఒకేసారి బావురుమని ఏడ్చిందట. ఇక సీన్ బాగా రావడంతో ఆమెను అందరు మెచ్చుకున్నారట. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది. కామెడీతో ప్రేక్షకులను పిచ్చెక్కించే అనిల్ .. ఇలాంటి యాక్షన్ ఫిల్మ్స్ అందులోనూ బాలయ్యను ఏ రేంజ్ లో చూపించనున్నాడో అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

Show comments