NTV Telugu Site icon

Nandamuri Balakrishna: మా కుటుంబం.. మా కులం.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న బాలయ్య స్పీచ్

Bala

Bala

Nandamuri Balakrishna: రామ్ పోతినేని, శ్రీలీల జంటగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం స్కంద. సెప్టెంబర్ 17 న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ థండర్ ను మేకర్స్ గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్ కు నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిధిగా విచ్చేశాడు. ఇక ఈ ఈవెంట్ లో బాలకృష్ణ మాట్లాడుతూ.. మొదట శ్లోకంతో మొదలుపెట్టి స్కంద గురించి మాట్లాడం మొదలుపెట్టాడు. ” రామ్ నాకు ఛాలెంజ్ విసిరాడు.. నేను తెలంగాణ భాషల్లో సినిమా చేస్తే.. ఇస్మార్ట్ శంకర్ తో వచ్చాడు. ఇప్పుడు భగవంత్ కేసరితో వస్తుంటే.. ఇస్మార్ట్ శంకర్ 2 తో వస్తున్నాడు. స్కంద లాంటి టైటిల్ పెట్టినందుకు నా శిరస్సు వచ్చి భక్తిభావం తెలియజేస్తున్నాను.

Ram Pothineni: మూడు జనరేషన్లను మాయ చేసిన హీరో బాలయ్యే..

ఇక సినిమా అంటే ఈరోజుల్లో ఎలా ఉండాలి. ప్రేక్షకులను ఎలా రాబట్టుకోవాలి అనేది నిర్మాతలు తెలుసుకోవాలి.. ఎందుకంటే అదే పెద్ద ఛాలెంజ్. ఇక ఇక్కడ ఉన్న అభిమానులందరికీ నేను చేసే ప్రయత్నం.. నా ఆలోచన.. చలనచిత్ర ప్రస్థానం మొదలైనప్పటి ఉంచి ఇప్పటివరకు నన్ను సపోర్ట్ చేస్తున్నవారందరికి థాంక్స్. బోయపాటి శ్రీను, మా కాంబోలో మూడు సినిమాలు వచ్చాయి.. ఈ మధ్యనే వీరసింహారెడ్డి సినిమా వచ్చింది. డిఫరెంట్ కథలను ఆదరించే ప్రతిభ.. తెలుగు ప్రేక్షకులకు మాత్రమే ఉన్నాడు. ఇక్కడే కాదు విదేశాల్లో కూడా మన సినిమాలు ఆడుతున్నాయి అంటే తెలుగువారే కారణమని” చెప్పుకొచ్చాడు. ఇక చంద్రయాన్ 3 సక్సెస్ ను బాలయ్య గుర్తుచేశాడు. ఇస్రో శాస్త్రవేత్తల్లో ఉండవల్లికి చెందిన కృష్ణ ఉన్నాడని చెప్పుకొచ్చాడు. ఇక స్కంద సినిమాను భారీ విజయవంతం కావాలని కోరుకుంటున్నాను అని అన్నారు. ఇక బోయపాటి గురించి చెప్పాల్సిన అవసరం లేదని తెలిపాడు. ఇక చిత్ర బృందం గురించి బాలయ్య మాట్లాడాడు. చలన చిత్ర పరిశ్రమ అంతా ఒక కుటుంబం.. ఒక కులం మాది.. అలాగే అభిమానులు కూడా అన్ని సినిమాలు చూస్తూ.. మంచి సినిమాను ఆదరిస్తూ ఉన్న ప్రేక్షకులుకు నా ధన్యవాదాలు” అంటూ ముగించాడు.

Show comments