Site icon NTV Telugu

పునీత్ రాజ్ కుమార్ పార్థివదేహనికి ప్రముఖుల శ్రద్ధాంజలి

puneeth

puneeth

అకాల మరణంతో కన్నడ నాట తీవ్ర విషాదాన్ని నింపిన శాండల్ వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ పార్థివదేహనికి అభిమానులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. పునీత్ భౌతిక కాయాన్ని అభిమానుల సందర్శనార్థం బెంగుళూరులోని కంఠీరవ స్టేడియంలో ఉంచారు. ఆయనకు చివరిసారిగా కన్నీటి వీడ్కోలు పలకడానికి భారీ ఎత్తున అభిమానులు తరలి వస్తున్నారు. నిన్న కర్ణాటక సీఎం బొమ్మై ఆసుపత్రిలోనే పునీత్ కుటుంబాన్ని పరామర్శించారు. ఇక ఈరోజు సినీ ఇండస్ట్రీ నుంచి పలువురు ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పించడానికి బెంగుళూరుకు బయల్దేరారు.

Read Also : పునీత్ అంత్యక్రియలు… బెంగళూరుకు టాలీవుడ్ స్టార్స్

ఈ నేపథ్యంలో పునీత్ రాజ్ కుమార్ పార్థివదేహనికి నందమూరి బాలకృష్ణ, ప్రభుదేవా, కర్ణాటక మాజీ సిఎం సిద్దరామయ్య శ్రధ్ధాంజలి ఘటించారు. ఇంకా ఎన్టీఆర్, చిరంజీవితో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు అక్కడికి చేరుకోనున్నారు. ఇవాళ సాయంత్రం పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు జరగనున్నాయి. సాయంత్రం 5.00 గంటలకు పునీత్ కుమార్తె బెంగుళూరుకు చేరుకోనుంది. ఆమె ఇక్కడికి వచ్చాక అంత్యక్రియలు నిర్వహిస్తారు.

Exit mobile version