Site icon NTV Telugu

Nandamuri Balakrishna: హనుమాన్ డైరెక్టర్ తో బాలయ్య.. కాంబో కుదిరితే.. ఫ్యాన్స్ కు పూనకాలే ?

Bala

Bala

Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. బాబీ దర్శకత్వంలో ఒక సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లిన బాలయ్య.. ఇది కాకుండా మరో రెండు సినిమాలను లైనప్ లో పెట్టాడని సమాచారం. తన ఏజ్ కు తగ్గట్టు .. కథలను ఎంచుకొని బాలయ్య హిట్స్ అందుకుంటున్నాడు. ఈ మధ్య భగవంత్ కేసరి సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన బాలయ్య.. చాలా పాత జోనర్ ను ట్రై చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆయ‌న కెరీర్ లో ఎంతో ప్ర‌త్యేక‌మైన సినిమాలుగా నిలిచిన ఆదిత్య 369, భైర‌వ‌ద్వీపం ఫిక్ష‌న్ కంటెంట్ తో అల‌రించాయి. ఆదిత్య 369 ఫాంట‌సీ సైన్స్ ఫిక్ష‌న్ నేప‌థ్యంలో రూపొందిన ఆస‌క్తిక‌ర డ్రామా. టైమ్ ట్రావెల్ నేప‌థ్యంలో ఎంతో అద్భుతంగా తెర‌కెక్కింది. భైర‌వ ద్వీపం చిత్రంలోను ఫిక్ష‌న‌ల్ అంశాలు ప్ర‌జ‌ల‌ మ‌న‌సులు దోచుకున్నాయి.

Haromhara: నేల టికెట్ భామ సడెన్ గా దేవిగా ప్రత్యక్షమయ్యిందేంటి ..?

ఇక ఇప్పుడు బాలయ్య.. మైథలాజికల్ ఫాంటసీ మల్టీవర్స్ లో అడుగుపెడుతున్నాడని సమాచారం.డిఫరెంట్ కథలకు కేరాఫ్ అడ్రెస్ గా మారిన కుర్ర డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ప్రస్తుతం హనుమాన్ సినిమాతో బిజీగా ఉన్నాడు. తెలుగులో మొట్ట మొదటి సూపర్ హీరో కథగా ఈ సినిమా తెరకెక్కింది. వచ్చే ఏడాది సంక్రాంతికి హనుమాన్ రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా రిలీజ్ కు ముందే .. ప్రశాంత్ వర్మ .. బాలయ్యకు మైథలాజికల్ ఫాంటసీ మల్టీవర్స్ కథను వినిపించాడని టాక్ నడుస్తోంది. ఆ కథను చేయడానికి బాలయ్య కూడా సుముఖుత చూపించినట్లు సమాచారం. ఒకవేళ ఇదే కనుక నిజమైతే ఫ్యాన్స్ కు పూనకాలే అని చెప్పాలి. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

Exit mobile version