Nandamuri Balakrishnal: నందమూరి బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకలకు అందరికీ ఆహ్వానం
- నందమూరి బాలకృష్ణ నటుడిగా 50 ఏళ్లు పూర్తి
- సినీ పరిశ్రమ ఆధ్వర్యంలో గ్రాండ్ గా సెలబ్రేషన్స్ ని ప్లాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి బాలకృష్ణ నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు తెలుగు చలన చిత్ర పరిశ్రమ భారీగా సన్నాహాలు చేస్తోంది. సెప్టెంబర్ 1న హైదరాబాద్ హైటెక్స్ నోవోటెల్ హోటల్లో తెలుగు సినీ పరిశ్రమ ఆధ్వర్యంలో గ్రాండ్ గా సెలబ్రేషన్స్ ని ప్లాన్ చేశారు. సాయి ప్రియ కన్స్ట్రక్షన్స్ మెయిన్ స్పాన్సర్‌గా సుచిర్ ఇండియా కిరణ్‌తో కలిసి ఇండియాస్ నెంబర్ వన్ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ అయిన శ్రేయాస్ మీడియా అత్యంత ప్రతిష్టాత్మకంగా చేస్తున్న ఈ కార్యక్రమంలో ఎంతోమంది అతిరథమహారథులు పాల్గొనబోతున్నారు. ఈ కార్యక్రమం కోసం ఇప్పటికే ఎంతోమందికి ఆహ్వానాన్ని అందించారు. అయితే కొంతమందికి ఆహ్వానాలు అందలేదని వస్తున్న వార్తలపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ స్పందిస్తూ శుక్రవారం ప్రెస్ మీట్ నిర్వహించి క్లారిటీ ఇచ్చింది.
ఈ ప్రెస్ మీట్లో ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ..‘‘తెలుగు సినీ రంగంలోని అన్ని శాఖలు కలిసి బాలకృష్ణ గారి స్వర్ణోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నాయి. ఆర్టిస్టులు, టెక్నీషియన్లు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు ఇలా అందరూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటారు. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా పలువురు ప్రముఖులు పాల్గొంటారు. ఇతర రాష్ట్రాల ఫిల్మ్ ఇండస్ట్రీల నుంచి కూడా ప్రముఖులు వస్తారు. ఈ ఈవెంట్‌ను శ్రేయాస్ మీడియా నిర్వహిస్తోంది. ఇన్విటేషన్స్ అందలేదని మాకు కొన్ని ఫిర్యాదులు వచ్చాయి. అన్ని యూనియన్ల ద్వారా సభ్యులందరికీ పీడీఎఫ్ రూపంలో అందరికీ పంపించాము. ఫిజికల్ ఇన్విటేషన్ ఎవరికైనా రాకపోతే తెలుగు ఇండస్ట్రీ మన కుటుంబ అని భావించి అందరికీ ఇదే మా వ్యక్తిగత ఆహ్మానం అని భావించి ప్రతి ఒక్కరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాం’’ అని చెప్పారు.
Also Read
- NTRNeel : ఎన్టీఆర్ బర్త్‌డే ‘డబుల్ ధమాకా’.. ‘డ్రాగన్’ గ్లింప్స్.. ఇంకా..!
- Actor Vishal: ‘‘ఆయనకు ఏం తెలుసని మంత్రి పదవి ఇచ్చారు..?’’ సీఎం విజయ్‌పై విశాల్ ఘాటు వ్యాఖ్యలు..
- Jet Lee OTT Release: సడన్ సర్ప్రైజ్.. ‘జెట్ లీ’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!
- Manoj Manchu: మంచు మనోజ్ దంపతుల సంచలన నిర్ణయం.. ఐదుగురు పిల్లల దత్తత!
Also Read:Shakeela: హోటల్లో తెలుగు హీరోయిన్‌పై లైంగిక వేధింపులు.. మధ్యలో షకీలా ఎంట్రీ!
స్పాన్సర్ కిరణ్ మాట్లాడుతూ..‘‘బాలకృష్ణ 50 ఏళ్ల వేడుకలో భాగం కావడం మా అదృష్టం. ఒక చారిత్రాత్మక ఈవెంట్‌లా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. ఒక మంచి వ్యక్తి, ఒక మంచి నటుడు, అజాత శత్రువు అయిన బాలకృష్ణ గారికి ఇలాంటి సన్మానం చేయడం నిజంగా గొప్ప విషయం. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలి’’ అని పిలుపునిచ్చారు.
కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ కల్యాణ్ మాట్లాడుతూ..‘‘బాలకృష్ణ గారు నటన ప్రారంభించి 50 ఏళ్లు పూర్తి అవుతోంది. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోని అన్ని శాఖలు కలిసి ఇలాంటి కార్యక్రమం చేయడం ఇది మొదటిసారి. ఈ కార్యక్రమానికి మీడియాలో మంచి క్రేజ్ వస్తోంది. ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా జరగాలని కోరుకుంటున్నా.’’ అని అన్నారు.
ఈ కార్యక్రమంలో కేఎల్ఎన్ కల్యాణ్, అనుపమ్ రెడ్డి, చదలవాడ శ్రీనివాసరావు, సుచిర్ ఇండియా కిరణ్, మాదాల రవి, సీ కల్యాణ్, భరత్ భూషణ్, దామోదర్ ప్రసాద్, ప్రసన్న కుమార్, శివ బాలాజీ, పరుచూరి గోపాలకృష్ణ, అశోక్ కుమార్, మాదవపెద్ది సురేష్, సుబ్బారెడ్డి, అనిల్ కుమార్ వల్లభనేని, బాపిరాజు తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్‌లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్‌గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్‌కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
-
Shreyas Iyer: మా ఓటమికి కారణం ఆ ఇద్దరే.. అస్సలు ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన శ్రేయస్..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..