Nandamuri Balakrishna: ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి.. నారా భువనేశ్వరి లండన్‌లోని మే ఫెయిర్ హోటల్‌లో నిర్వహించిన అవార్డుల కార్యక్రమంలో రెండు ప్రతిష్టాత్మక అంతర్జాతీయ పురస్కారాలను అందుకున్నారు. ఇక, తన చెల్లి భువనేశ్వరికి ప్రతిష్టాత్మక అవార్డులు దక్కడంపై ఆనందం వ్యక్తం చేశారు హిందూపురం ఎమ్మెల్యే, నట సింహ నందమూరి బాలకృష్ణ.. సమాజ సేవలో చూపిన దృఢమైన నిబద్ధత, నైతిక విలువలతో కూడిన నాయకత్వం, ప్రజల జీవితాలను స్పర్శించిన మానవతా దృష్టికి గుర్తింపుగా ఈ అవార్డులు మాకు, తెలుగు ప్రజలకు గర్వకారణం అని హీరో నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు.
Read Also: Munnar Incident: మహిళా పర్యాటకురాలి పట్ల టాక్సీ డ్రైవర్ల అసభ్య ప్రవర్తన..అరెస్ట్
ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. “భువనేశ్వరి చెల్లెలు దూరదృష్టి, కృషి, నిజాయితీ, ప్రజల పట్ల ఉన్న సేవా భావం కోసం అంతర్జాతీయ స్థాయిలో లభించిన ఈ గౌరవాలు మనందరికీ ఆదర్శం, ప్రేరణగా ఉంటాయి” అని అభినందనలు తెలిపారు. ఈ అవార్డులు భువనేశ్వరి సేవాస్ఫూర్తి, నాయకత్వ నైపుణ్యాలను, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపుగా ప్రతిబింబిస్తున్నాయని పేర్కొన్నారు హీరో నందమూరి బాలకృష్ణ.. కాగా, లండన్‌లోని మేఫెయిర్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి రెండు ప్రతిష్టాత్మక అంతర్జాతీయ అవార్డులను అందుకున్నారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ (IoD) మరియు ఐవోడీ సంస్థ సంయుక్తంగా నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవంలో భువనేశ్వరికి ఈ గౌరవం లభించింది..
