NTV Telugu Site icon

Nandamuri Balakrishna: ఒంగోలు కు బాలయ్య.. అందరి చూపు ఆ బ్యాగ్ పైనే

Bala

Bala

Nandamuri Balakrishna: వీరసింహారెడ్డి జాతర మొదలయ్యింది.. నందమూరి అభిమానులు ఒంగోలులో రచ్చ చేయడం స్టార్ట్ చేశారు. బాలకృష్ణ, శృతి హాసన్ జంటగా నటించిన చిత్రం వీరసింహారెడ్డి. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెన్ ఒంగోలులో ఘనంగా నిర్వహిస్తున్నారు. గత రెండు రోజులుగా ఈ ఈవెంట్ జరుగుతుందా..? లేదా అన్న అనుమానాల మధ్య ఎట్టకేలకు ఈవెంట్ మొదలయ్యింది. ఇక హైదరాబాద్ నుంచి బాలయ్య స్పెషల్ ఛాపర్ లో ఒంగోలుకు చేరుకున్నారు.

Read Also: Air India Incident: మహిళపై మూత్రవిసర్జన చేసిన వ్యక్తి.. ఉద్యోగం నుంచి తొలగించిన కంపెనీ..

బాలయ్యతో పాటు హీరోయిన్ శృతి హసన్, నిర్మాతలు ఉన్నారు. ఇక ఛాపర్ కోసం ఎదురుచూస్తున్న సమయంలో శృతి, బాలయ్య సందడి చేశారు. శృతి రాగానే బాలయ్య కాళ్లకు నమస్కారం చేసి ఆశీర్వాదాలు తీసుకుంది. ఇక బ్లాక్ కలర్ చీరలో శృతి అందంగా కనిపించగా.. మల్టీ కలర్ సూట్ లో బాలయ్య మరింత హ్యాండ్సమ్ గా కనిపించాడు. ఇక ఆ సమయంలో బాలయ్య చేతిలో ఉన్న బ్యాగ్ పై అందరి కన్ను పడింది. ఆ బ్యాగ్ పై వీరసింహరెడ్డి లోగో ఉండడం విశేషం. ఉగ్ర రూపం లో ఉన్న నరసింహుడు బొమ్మ ఆ బ్యాగ్ పై చిత్రించి ఉండడం విశేషం. అయితే ఈ బ్యాగ్ ఎవరిది అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ బ్యాగ్ చూసాక.. అభిమానులు అలాంటి డిజైన్ ఉన్న బ్యాగ్ లు కావాలంటూ చెప్పుకొస్తున్నారు. మరి ప్రమోషన్స్ కోసం ఆ బ్యాగ్లను చిత్ర బృందం అభిమానులకు అందుబాటులో పెడుతుందేమో చూడాలి.

Show comments