అఖండ: బాలయ్యకు లేదు పోటీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందుతోన్న హ్యాట్రిక్ చిత్రం ‘అఖండ’.. ఇదివరకు వీరి కాంబినేషన్ లో వచ్చిన సింహ, లెజెండ్ సినిమాలు భారీ హిట్స్ సాధించడంతో అఖండ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. కరోనా వేవ్ తర్వాత శరవేగంగా జరుగుతున్న ఈ చిత్ర షూటింగ్ చివరిదశలో ఉండగా, రెండు పాటల షూటింగ్ బ్యాలన్స్ వుంది. ప్రస్తుతం చిత్రబృందం విడుదల తేదీపై చర్చలు మొదలెట్టింది.
తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా దీపావళి పండగకు రానున్నట్లు తెలుస్తోంది. దసరా కానుకగా ప్లాన్ చేసిన షూటింగ్ ఆలస్యం కారణంగా కుదరలేదు. దీంతో దీపావళి సమయానికి ఈ చిత్రం పక్కాగా రానున్నట్లు తెలుస్తోంది. అయితే సంక్రాంతికి తీసుకొచ్చే చర్చలు జరుగగా.. భారీ సినిమాలు పోటీలో ఉండటంతో ఆ రేసు నుంచి తప్పుకొంది. ఇక అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమా కూడా డిసెంబర్ 17న రానున్నట్లు ప్రకటించింది. దీంతో బాలయ్య సినిమా దీపావళికి దాదాపు ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ సినిమా కూడా దీపావళి రేసులో లేకపోవడంతో బాలయ్య ‘అఖండ’ సినిమాకు ఏ భారీ సినిమా కూడా పోటీ లేనట్లు కనిపిస్తోంది. అయితే ఇంకా కావాల్సినంత సమయం ఉండటంతో ఏ సినిమా అయినా దీపావళి రేసులో ఉంటుందో, లేదో చూడాలి.
Also Read
- ‘ఆడోళ్లు ఎక్స్ట్రీమ్కు వెళ్తే ఏ మగాడూ తట్టుకోలేడు’ విమెన్ పవర్‌పై Srikanth Odela మైండ్ బ్లోయింగ్ కామెంట్స్!
- ‘నెక్స్ట్ టైమ్ కొడితే దిమ్మతిరిగిపోవాలి’.. ‘పారడైజ్’ టాక్ వేళ Nani-Srikanth Odela క్రేజీ ప్రామిస్!
- SS Rajamouli 25 Years: కథలు మారాయి, హీరోలు మారారు.. కానీ జక్కన్న ఆలోచన మాత్రం మారలేదు!
- Pongal 2027 : ఇది అసలైన పోటీ అంటే.. సంక్రాంతి బరిలో సూపర్ స్టార్ రజనీ
తాజావార్తలు
-
Brave Head Constable: తమిళనాడులో రెచ్చిపోయిన గుట్కా ముఠాలు.. సినిమా రేంజిలో ఛేజింగ్..
-
CM Revanth Reddy : శ్వేతపత్రం విడుదల చేశాకే సిరిసిల్లలో అడుగుపెట్టాలి
-
LPU Students Protest: LPUలో స్టూడెంట్స్ రచ్చ.. రేప్ ఆరోపణలతో వర్సిటీలో విధ్వంసం..
-
Bill Gates: ‘ఏఐతో బిలియన్ల మరణాలు సంభవించవచ్చు’..
-
‘ఆడోళ్లు ఎక్స్ట్రీమ్కు వెళ్తే ఏ మగాడూ తట్టుకోలేడు’ విమెన్ పవర్‌పై Srikanth Odela మైండ్ బ్లోయింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?