Site icon NTV Telugu

SSMB28: మహేశ్ కొత్త లుక్ రిలీజ్.. ఫ్యాన్స్‌కి పూనకాలే!

Mahesh New Look From Ssmb28

Mahesh New Look From Ssmb28

Namratha Shirodkar Shares Mahesh Babu New Look: సూపర్‌స్టార్ మహేశ్ బాబు సబ్జెక్టుల పరంగా చాలా ప్రయోగాలు చేశాడు. కానీ, లుక్ పరంగానే పెద్దగా మార్పులు చూపలేదు. ఒకే స్టైల్‌ని మెయింటెయిన్ చేస్తూ వస్తున్నాడు. అఫ్‌కోర్స్.. మహర్షి కోసం కొంచెం గెడ్డం, ‘సర్కారు వారి పాట’లో కాస్త జుట్టు పెంచాడు. కానీ.. పెద్దగా తేడా కనిపించలేదు. అయితే.. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయబోతున్న SSMB28 కోసం మహేశ్ సరికొత్త లుక్‌లో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. ఆల్రెడీ అతని లుక్‌కి సంబంధించిన ఫోటోను మహేశ్ భార్య నమ్రతా శిరోద్కర్ లేటెస్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. కొంచెం గెడ్డం పెంచి, చెదిరిన జుట్టుతో చాలా స్టైల్‌గా కనిపించాడు మహేశ్. స్టైలిష్ ఆలిమ్ హకీమ్ మన సూపర్‌స్టార్‌ని ఇలా స్టైలిష్‌గా తయారు చేశాడు. ఈ ఫోటో పెట్టి ‘వర్క్ మోడ్ ఆన్’ అని నమ్రతా క్యాప్షన్ పెట్టి, సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యిందని క్లారిటీ ఇచ్చింది.

కాగా.. పూర్తిస్థాయి యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందనున్న ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 28వ తేదీన గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నట్టు ఇదివరకే చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. అతడు, ఖలేజా తర్వాత మహేశ్, త్రివిక్రమ్ కాంబోలో వస్తోన్న మూడో సినిమా కావడంతో.. ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ సినిమాను హారికా & హాసినీ, సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఎస్ఎస్ తమన్ సంగీతం సమకూరుస్తోన్న ఈ చిత్రంలో.. కీలక పాత్రల కోసం కొందరు ప్రధాన నటీనటుల్ని రంగంలోకి దింపుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా.. విలన్ పాత్ర కోసం పరభాష నటుడ్ని, అందునా దక్షిణాది నుంచి ఓ ప్రముఖ నటుడ్ని తీసుకోనున్నట్టు టాక్స్ వినిపిస్తున్నాయి. త్వరలోనే అతనెవరన్న విషయం రివీల్ కానుంది.

Exit mobile version