Site icon NTV Telugu

Naga Vamsi : నాగవంశీ షాకింగ్ ట్వీట్.. ఎవరిని ఉద్దేశించి..?

Nagavamshi

Nagavamshi

Naga Vamsi : టాలీవుడ్ లో పవన్ కల్యాణ్‌ ప్రకటనతో రచ్చ మొదలైంది. ఈ క్రమంలోనే నిర్మాతలు ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. ఇప్పటికే బన్నీ వాస్ నిర్మాతల పనితీరు కరెక్ట్ గా లేదని చెప్పారు. ఇప్పుడు తాజాగా నిర్మాత నాగవంశీ చేసిన ట్వీట్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సాధారణంగా ప్రతి విషయంపై స్పందించే నాగవంశీ.. ఈ అంశంపై ఇన్ డైరెక్ట్ గా ట్వీట్ చేసినట్టు అర్థం అవుతోంది. అసలు తన ట్వీట్ లో ఎక్కాడా ఇష్యూ గురించి గానీ.. పవన్ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యల గురించి గానీ.. థియేటర్ల బంద్, ఎగ్జిబిటర్ల సమస్యలపై ప్రస్తావించలేదు.

Read Also : Bunny Vas : పవన్ ఇరిటేట్.. ఇండస్ట్రీ సరిగా లేదు.. బన్నీ వాస్ కామెంట్స్

‘దృష్టి వేరే చోట అవసరమైన సమయంలో అనవసరమైన సమస్యలు సృష్టించబడి, చాలా పెద్ద సమస్యలకు దారితీశాయి. బుద్ధి ప్రధాన పాత్ర పోషించి ఉంటే, ఈ సమస్యలను సులభంగా నివారించి ఉండవచ్చు’ అంటూ తన ట్వీట్ లో రాసుకొచ్చారు. ఇది ఒక రకంగా ప్రస్తుతం టాలీవుడ్ లో నెలకొన్న పరిస్థితులను సింక్ చేసేలా ఉంది. అనవసరమైన సమస్యలు ఇండస్ట్రీలో సృష్టించారు అనే అర్థం వస్తోంది. పైగా బుద్ధఙ ప్రధాన పాత్ర ఓషించాలి అనే మాట కూడా ఇక్కడ హైలెట్ అవుతోంది.

అంటే ఇండస్ట్రీలో ఎవరో ఒకరు ప్రధాన పాత్ర తీసుకుంటే ఇవన్నీ సద్దుమణిగేవి అన్నట్టు ఆయన ట్వీట్ లో ఉంది. నిర్మాతలు ఎవరికి వారే అన్నట్టు ముందుకు సాగుతున్న సంగతి కనిపిస్తోంది. కానీ అలా కాకుడా ఐక్యతతో వారిని నడిపించే వ్యక్తి కావాలేమో అన్నట్టు నాగవంశీ ట్వీట్ లో ఉంది. ఏదేమైనా ఈ ట్వీట్ పై ఇప్పుడు రకరకాల చర్చలు జరుగుతున్నాయి. మరి నాగవంశీ మళ్లీ ఏమైనా క్లారిటీ ఇస్తారో లేదో చూడాలి.

Read Also : Theatre Crisis: అసలు థియేటర్లో రెంట్, పర్సంటేజ్ బేసిస్ అంటే ఏంటి?

Exit mobile version