NTV Telugu Site icon

Akkineni Nagarjuna: ఈసారి కూడా బిగ్ బాస్ హోస్ట్ మన్మథుడే.. ఇదుగో సాక్ష్యం

Nag

Nag

Akkineni Nagarjuna: బిగ్ బాస్.. తెలుగు సీజన్ 7 కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని కారణాల వలన బిగ్ బాస్ లేట్ అయ్యింది.. లేకపోతే ఇప్పటికే సీజన్ 7 మొదలుకావాల్సి ఉంది. ఇకపోతే ఈ మధ్యనే బిగ్ బాస్ సీజన్ 7 ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. బిగ్ బాస్ లోగోను రిలీజ్ చేస్తూ త్వరలోనే బిగ్ బాస్ ప్రారంభం కానుందని తెలిపారు. దీంతో అభిమానులు బిగ్ బాస్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ఈసారి హోస్ట్ గా అక్కినేని నాగార్జున చేయడం లేదని ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో అభిమానులు సైతం నాగార్జున వద్దని, ఆయన కంటెస్టెంట్స్ పై సీరియస్ అవ్వడం లేదని, వారు ఏం చేసినా పట్టించుకోవడం లేదని చెప్పుకొస్తున్నారు. అంతేకాకుండా గత నాలుగు సీజన్స్ నుంచి నాగార్జుననే హోస్ట్ గా ఉండడంతో అభిమానులు బోర్ ఫీల్ అవుతున్నారని, కొత్త హోస్ట్ గా మరో స్టార్ హీరోను దించితే బావుంటుందని అభిమానూలు చెప్పుకొస్తున్నారు. అయితే అలా కోరుకుంటున్నవారందరికి మరోసారి నిరాశే ఎదురయ్యింది. ఎందుకంటే ఈసారి కూడా నాగ్ నే బిగ్ బాస్ కు హోస్ట్ గా రానున్నాడు.

Khushi: విజయ్ దేవరకొండ- సమంత కొత్త కాపురం.. రొమాన్స్ అయితే అదుర్స్

బిగ్ బాస్ లోగో లాంచ్ అయిన వెంటనే.. బిగ్ బాస్ హోస్ట్ ప్రోమో రానుంది. దీనికోసం నాగ్ ఫోటోషూట్ చేశాడు. తాజాగా ఆ ఫోటోషూట్ లోని ఒక ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఈసారి బిజీగా బాస్ సీజన్ 7 లో నాగ్ లుక్ మాత్రం అదిరిపోయిందని చెప్పాలి. ఎప్పుడు క్లీన్ షేవ్ తో కనిపించే నాగ్.. ఈసారి రగ్గడ్ లుక్ తో అదరగొట్టాడు. లైట్ గా గడ్డం, సూట్ తో 7 నెంబర్ ను చేత్తో చూపిస్తూ చేసిన ఫోటో షూట్ నెట్టింట వైరల్ గా మారింది. త్వరలోనే మేకర్స్ నాగ్ ను అధికారికంగా మరోసారి హోస్ట్ అని అనౌన్స్ చేయనున్నారు. మరి ఈసారి అయినా నాగ్.. కంటెస్టెంట్స్ పై సీరియస్ అయ్యి అభిమానుల మనసును చూరగొట్టాడేమో చూడాలి.