టాలీవుడ్ కింగ్ నాగార్జున అప్ కమింగ్ మూవీ ‘ఘోస్ట్’ సినిమా షూటింగ్ దశలో ఉంది. అయితే కరోనా మహమ్మారి వల్ల ఈ సినిమాకు కూడా తిప్పలు తప్పడం లేదు. ‘ఘోస్ట్’ నెక్స్ట్ షెడ్యూల్ షూటింగ్ దుబాయ్ లో ప్రారంభం కావలసి ఉంది. అయితే తాజాగా దుబాయ్‌కి వెళ్లాల్సిన కొంతమంది యూనిట్ సభ్యులకు కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. ఫలితంగా షూటింగ్ షెడ్యూల్ వాయిదా పడింది. పాజిటివ్ అని తేలిన ‘ఘోస్ట్’ టీమ్ సభ్యులు ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ షూటింగ్‌కి కొంత విరామం ఇవ్వాల్సి వచ్చింది. వారికి కరోనా తగ్గిన తరువాత కొత్తగా దుబాయ్ షెడ్యూల్ డేట్స్ ఖరారు చేయనున్నారు.
Read Also : ప్రభాస్ “ప్రాజెక్ట్ కే” మేజర్ అప్‌డేట్
నాగార్జున, ‘గరుడ వేగ’ దర్శకుడు ప్రవీణ్ సత్తారు కాంబోలో వస్తున్న ఆసక్తికరమైన చిత్రం ‘ఘోస్ట్’. ఈ చిత్రంలో సోనాల్ చౌహాన్, గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. నారాయణ్ దాస్ కె నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ ‘ఘోస్ట్’ను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్ర బృందంలో సినిమాటోగ్రాఫర్ ముఖేష్ జి, ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మ కడలి, స్టంట్ డైరెక్టర్లు రాబిన్ సుబ్బు, నభా మాస్టర్ ఉన్నారు. ఇక ఇటీవలే ‘బంగార్రాజు’తో నాగార్జున మంచి విజయం అందుకున్న విషయం తెలిసిందే.