Coolie : రజినీకాంత్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ కూలీ. నాగార్జున తన కెరీర్ లో ఫస్ట్ టైమ్ విలన్ రోల్ చేస్తున్నాడు ఈ మూవీలో. ఆగస్టు 14న రిలీజ్ అవుతున్న సందర్భంగా వరుస ప్రమోషన్లు చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లో నిర్వహించిన ఈవెంట్ లో నాగార్జున మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నాడు. నాగ్ మాట్లాడుతూ.. లోకేష్ సినిమాలు చూసినప్పుడు అతనితో ఎలాగైనా పనిచేయాలని కోరుకున్నాను. అనుకోకుండా లోకేష్ నా ఇంటికి వచ్చి ఇలా నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ ఉంది చేస్తారా అని అడిగాడు. చేయను అంటే కాఫీ తాగి వెళ్లిపోతా అన్నాడు. ముందు రోల్ గురించి చెప్పు అని విన్నాను. అతను కథ చెప్పినప్పుడు నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఈ సినిమాలో నా పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది అంటూ తెలిపారు నాగార్జున.
Read Also : Coolie : నాగార్జునపై రజినీకాంత్ జోకులు..
రజినీకాంత్ ఈ మూవీకి ఒప్పుకున్నారా అని అడిగినట్టు నాగార్జున చెప్పుకొచ్చాడు. ‘ఎందుకంటే హీరో పాత్ర కంటే నా పాత్ర చాలా స్టైలిష్ గా ఉంటుంది. ఇక షూటింగ్ కు వచ్చిన మొదటి రోజు రజినీ గారు నా క్యారవాన్ కు వచ్చి వెల్కమ్ చెప్పారు. సెట్స్ కు వెళ్లిన తర్వాత నన్ను ఒక రెండు నిముషాల పాటు చూశారు. నువ్వు ఇలా ఉంటావని తెలిస్తే ఈ పాత్రకు నిన్ను తీసుకోవద్దని చెప్పేవాడిని. అవసరం అయితే ఆ పాత్ర నేనే చేసేవాడిని కదా అన్నారు. ఆయన మాటలకు షాక్ అయ్యా. అది నా లైఫ్ లో ది బెస్ట్ కాంప్లిమెంట్. ఆయన చాలా హంబుల్ పర్సన్. అందరితో సరదాగా ఉంటారు. థాయ్ లాండ్ కు షూటింగ్ కోసం వెళ్లినప్పుడు అక్కడకు వచ్చిన 350 మంది టెక్నీషియన్లకు డబ్బులు ఇచ్చి ఇంటికి ఏమైనా తీసుకెళ్లండి అని చెప్పారు. అది చూసి చాలా సంతోషంగా అనిపించింది. ఆయన వల్లే ఈ మూవీ ఇంత అద్భుతంగా వచ్చింది అంటూ తెలిపాడు నాగార్జున.
Read Also : Coolie : తెలుగులో రాజమౌళి.. తమిళ్ లో లోకేష్.. రజినీ కామెంట్స్
