Nagarjuna : నాగార్జున ఇప్పుడు ఫుల్ జోష్ మీదున్నాడు. కుబేర, కూలీ సినిమాలు మంచి హిట్ అయ్యాయి. ఆయన పాత్రలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ క్రమంలోనే ఆయన జగపతి బాబు హోస్ట్ గా చేస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా షోకు గెస్ట్ గా వచ్చారు. ఇందులో అనేక విషయాలను పంచుకున్నాడు. నేను సినిమాల్లోకి వచ్చినప్పుడు నా పేరు కూడా పెద్దగా ఎవరికీ తెలియదు. అప్పుడు నాగేశ్వర రావు కొడుకు అనే అన్నారు. నా మొదటి సినిమా చూసిన తర్వాత కొందరు మెచ్చుకున్నారు. ఇంకొందరు తిట్టుకున్నారు. అప్పట్లో మణిరత్నం గారి సినిమాలు చూసి నాకు ఆయనతో పనిచేయాలని కోరిక కలిగింది.
Read Also : Rajini Kanth : పవన్ కల్యాణ్ పొలిటికల్ తుఫాన్.. రజినీకాంత్ ట్వీట్
ఆయన ఏ పార్కుకు వస్తారో తెలుసుకుని నెల రోజుల పాటు అదే పార్కులో తిరిగాను. ఆయనతో పది నిముషాలు వాకింగ్ చేసిన తర్వాత టెన్నిస్ ఆడటానికి వెళ్లిపోయేవారు. అలా నెల రోజుల తర్వాత నా కోసం కథ రెడీ చేశారు. అలా గీతాంజలి సినిమా వచ్చింది. అది నా మనసుకు ఎంతో దగ్గరైంది. ఆ సినిమాతో నాకు మంచి బూస్ట్ వచ్చింది. ఆ మూవీ తర్వాత నాకు యాక్టింగ్ మీద ఇంకా గ్రిప్ పెరిగింది. ఇప్పటికీ నన్ను నేను నమ్ముకుని పనిచేస్తాను. చాలా డిఫరెంట్ పాత్రలు చేయాలని ఉంది అంటూ తెలిపాడు నాగార్జున. ఆయన చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Read Also : Nagarjuna : జగపతిబాబును తన సినిమాలో వద్దన్న నాగార్జున.. ఎందుకంటే..?