Site icon NTV Telugu

Shiva Re Release : యంగ్ హీరోలపై నాగార్జున ప్రభావం ఉంటుంది.. మంత్రి కోమటిరెడ్డి ట్వీట్

Nagarjuna

Nagarjuna

Shiva Re Release : తెలుగు సినిమా హిస్టరీలో ట్రెండ్ సెట్ చేసిన మూవీ ‘శివ’. రిలీజ్ రోజున యూత్ ను విపరీతంగా ఆకట్టుకుంది. దెబ్బకు తిరుగులేని కలెక్షన్లు, రికార్డులు సృష్టించింది. యూత్ లో నాగార్జునకు మాస్ ఫాలోయింగ్ పెంచుతూ.. స్టార్ ఇమేజ్ ను తెచ్చిపెట్టింది. ఆ మూవీ నేడు రీ రిలీజ్ అయింది. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పెషల్ ట్వీట్ చేశారు. ఇప్పటికే చిరంజీవి, రాజమౌళి, ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ బాబు వంటి స్టార్లు ఇప్పటికే ‘శివ’కు గురించి తమ ఒపీనియన్ చెప్పగా.. మంత్రి కోమటిరెడ్డి నాగార్జునకు స్పెషల్ విషెస్ తెలిపారు. ‘శివ’ సినిమా తెలుగు చిత్ర పరిశ్రమను పూర్తిగా కొత్త దిశలో నడిపించింది.

Read Also : Kantha : దుల్కర్ సల్మాన్ కాంత మూవీ స్ట్రీమింగ్ పార్ట్ నర్ ఫిక్స్

ఈ సినిమాలో నాగార్జున నటన, స్టైల్, స్క్రీన్ ప్రెజెన్స్ అన్ని తరాల వారికి కనెక్ట్ అయ్యేలా ఉంటాయి. టాలీవుడ్ లో ఏఎన్నార్ వారసత్వాన్ని సమర్థంగా ముందుకు తీసుకువెళ్తూ, ఇండస్ట్రీ పురోగతికి నాగార్జున చేసిన కృషి అద్భుతం అన్నారు కోమటిరెడ్డి. శివ మూవీ తర్వాత అన్నమయ్య, షిర్డీ సాయి, భక్త రామదాసు లాంటి విభిన్న సినిమాలు చేసి ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేశాడు నాగార్జున. ముందు తరాల హీరోలకు కూడా నాగార్జున ఎంతో స్ఫూర్తి. ఆయన ప్రభావం రాబోయే హీరోల మీద కచ్చితంగా ఉంటుందని తెలిపాడు కోమటిరెడ్డి. ఆయన ట్వీట్ కు నాగార్జున ప్రత్యేక ధన్యావాదాలు తెలిపాడు. టైమ్ ఉంటే సినిమా చూడాలని కోరాడు.

Read Also : Shiva Re-Release : ఆర్జీవీ-నాగార్జున స్పెషల్ చిట్ చాట్.. వీడియో రిలీజ్

Exit mobile version