Site icon NTV Telugu

Nagarjuna : కుబేర హీరో శేఖర్ కమ్ములనే.. మూవీ కొత్తగా ఉంటుంది

Nagarjuna

Nagarjuna

Nagarjuna : ధనుష్ తో పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. ఆయన నటన అద్భుతం. ఆయన సెట్స్ లోకి వచ్చాక ఎలాంటి గెటప్ వేయడానికైనా వెనకాడరు. ఈజీగా గెటప్ లోకి మారిపోతారు. ఆయనతో పనిచేయడం అస్సలు మర్చిపోలేను. కుబేర గురించి మాట్లాడాలంటే శేఖర్ కమ్ముల గారే నాకు గుర్తుకు వస్తారు. ఇది నా సినిమా కాదు.. ధనుష్ మూవీ కాదు. రష్మిక మూవీ కాదు. ఇది కేవలం శేఖర్ కమ్ముల గారి సినిమా మాత్రమే. ఆయన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి చేసిన మూవీ ఇది.

Read Also : Dhanush : నాగార్జున మూవీలు చూస్తూ పెరిగా.. శేఖర్ అలాంటి పనులే చేస్తారు..

నన్ను కూడా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు తెచ్చాడు. మాయా బజార్ సినిమాలో కేవీ రెడ్డి గారే హీరో. ఈ కుబేరలో కూడా శేఖర్ హీరో. మేం రొటీన్ సినిమాల నుంచి బయటపడి కుబేర చేశాం. ఇది నాకు అద్భుతమైన అనుభవం ఇచ్చింది. డీఎస్పీ దీనికి మరో బలం. పాటలు విన్నాక పూనకం వచ్చింది. నేను గీతాంజలి నుంచి ఇలాగే ఉన్నాను. తోట తరణి గారు అలాగే ఉన్నారు. మూవీని చూసి ఎంజాయ్ చేయండి. రష్మికతో పనిచేయడం సంతోషంగా ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. హైదరాబాద్ లో తాగి నడిపితే పట్టుకుంటారు. కాబట్టి జాగ్రత్తగా వెళ్లి మీ నాన్నకు దండం పెట్టుకోండి’ అంటూ చెప్పాడు.

Read Also : Shekhar Kammula : రాజమౌళి మాకు ధైర్యం ఇచ్చాడు.. శేఖర్ కమ్ముల కామెంట్స్

Exit mobile version