Nagababu: ఇండియాలో ఏ పనికి మాలిన వెధవ ఆర్జీవీకి హాని తలపెట్టడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nagababu: వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఏ సినిమా తీసినా వివాదం లేకుండా ఉండదు. ఇక ఇప్పుడు వ్యూహం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. జగన్ బయోపిక్ గా తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 29 న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో వర్మ బిజీగా ఉన్నాడు. ఇక ఈ సినిమా రిలీజ్ గురించి అమరావతి ఉద్యమ నేత కొలికపూడి శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. శ్రీనివాసరావు ఓ న్యూస్ ఛానల్ లైవ్ లో మాట్లాడుతూ సమాజానికి తన సినిమాలతో కంటకంగా మారిన డైరెక్టర్ ఆర్జీవీ తల నరికి వస్తే కోటి రూపాయలు బహుమతి ఇస్తానని కొలికపూడి శ్రీనివాసరావు ప్రకటించారు. దీంతో వర్మ.. పోలీసులు, కేసు అంటూ తిరుగుతున్నాడు. ఈ విషయం పై ఆర్జీవీ నేరుగా నేడు ఏపీ డీజీపీ కార్యాలయానికి చేరుకున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కొలికపూడి శ్రీనివాసరావు పై డిజిపికి ఆయన ఫిర్యాదుచేశాడు.
తాజాగా ఈ విషయంపై జనసేన నేత నాగబాబు స్పందించాడు. ఆర్జీవీ కంప్లైంటుపై నాగబాబు సోషల్ మీడియాలో సెటైరికల్ పోస్ట్ పెట్టాడు. ఆర్జీవీని కమెడియనుతో పోలుస్తూ వెటకారంగా మాట్లాడాడు. తల నరకితే కోటి రూపాయలు ఇస్తాననడం తప్పంటూనే ఆర్జీవీపై సెటైర్లు వేశాడు. “”RGV గారి పై అటువంటి వ్యాఖ్యలు చేయడం తప్పు నేను కూడ వాటిని తీవ్రంగా ఖండిస్తున్నాను..RGV గారు మీరేం భయపడకండి మీ జీవితానికి ఏ డోఖా లేదు, మీ ప్రాణానికి ఏ అపాయం వాటిల్లదని నేను హామీ ఇస్తున్నాను ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో..ఆ మాటకొస్తే ఇండియా లో ఏ పనికిమాలిన ఎధవ మీకెటువంటి హాని తలపెట్టడు. ఎందుకంటే హీరో విలన్ కొట్టుకుంటుంటే మధ్యలో కమెడియన్ గాడ్ని ఎవడు చంపడు కదా.. మీరేం వర్రీ అవకండి కాబట్టి నిశ్చింతగా, నిర్భయంగా ఓ ఓడ్కా పెగ్గేసి పడుకోండి…ఎల్లపుడు మీ మంచి కోరే మీ శ్రేయోభిలాషి” అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. మరి నాగబాబు పోస్ట్ కు వర్మ ఎలా స్పందిస్తాడో చూడాలి.
Also Read
- Vijay : 'మెగా 158' నిర్మాతకు క్యాబినెట్ హోదా.. సీఎం విజయ్ నిర్ణయం వెనుక అసలు కారణమేంటి?
- Anirudh : అనిరుథ్ - కావ్య మారన్ పెళ్లి.. కన్ఫర్మ్ చేసిన ఫ్యామిలీ మెంబర్
- Sambarala Yeti Gattu: క్లైమాక్స్‌కు చేరుకున్న సాయి దుర్గ తేజ్ పాన్ ఇండియా మూవీ.. చివరి షెడ్యూల్‌తో భారీ అప్డేట్!
- Jackky Bhagnani: హీరోయిన్ రకుల్‌తో పెళ్లై ఏడాది కూడా కాకముందే డేటింగ్ యాప్‌లో జాకీ భగ్నానీ? వైరల్ అవుతున్న లీక్స్!
తాజావార్తలు
-
Abhishek Sharma Fifty: షాకింగ్.. అభిషేక్ శర్మ అర్ధ శతకం రద్దు.. కారణం ఏంటో తెలుసా?
-
Vijay : ‘మెగా 158’ నిర్మాతకు క్యాబినెట్ హోదా.. సీఎం విజయ్ నిర్ణయం వెనుక అసలు కారణమేంటి?
-
Japan Earthquake: జపాన్‌లో 6.1 తీవ్రతతో భూకంపం.. వారం రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 11 ప్రధాన ప్రకంపనలు
-
Anirudh : అనిరుథ్ – కావ్య మారన్ పెళ్లి.. కన్ఫర్మ్ చేసిన ఫ్యామిలీ మెంబర్
-
IND vs IRE: పరువు నిలబెట్టుకునే పోరు.. సంజూకు రెస్ట్.. వైభవ్‌కు ఛాన్స్.. టీమిండియా ప్లేయింగ్-11 ఇదే!
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్‌తో మరింత సౌలభ్యం.!