Nagavamshi : ప్రొడ్యూసర్ నాగవంశీ ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉంటున్నారు. వరుస హిట్లతో జోరుమీదున్నాడు. లక్కీ భాస్కర్ తో భారీ హిట్ అందుకున్నాడు. ఇప్పుడు మ్యాడ్ స్వ్కేర్ సినిమాతో మరోసారి రాబోతున్నాడు. ఈ మూవీ ప్రమోషన్లలో బిజీగా గడుపుతున్నాడు. ఈ సినిమాలో ఆయన ఓ పాత్ర కూడా చేశాడు. మార్చి 28న రిలీజ్ కాబోతున్న సినిమా కోసం ప్రమోషన్లు జోరుగా చేస్తున్నారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఇందులో అల్లు అర్జున్-త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా కథపై కూడా స్పందించారు. గతంలో కూడా ఆయన ఈ మూవీ గురించి కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. ఇది మైథలాజికల్ మూవీ అని ఎప్పుడో క్లారిటీ ఇచ్చేశాడు. ఇక తాజాగా మరోసారి దాని గురించి మాట్లాడాడు.
Read Also : Lady Aghori: లేడీ అఘోరీపై కేసు..! వశీకరణంతో నా కూతుర్ని తీసుకెళ్లి..!
ఈ నడుమ ఇండియన్ సినిమాల్లో మైథలాజికల్ కథలు రావట్లేదు ఎందుకని అని యాంకర్ అడిగిన ప్రశ్నకు నావంశీ క్లారిటీ ఇచ్చాడు. ఇప్పుడు మేం అదే కాన్సెప్టుతో వస్తున్నాం. అల్లు అర్జున్, త్రివిక్రమ్ మూవీ కథ మైథలాజికల్ కు సంబంధించిందే. ఆ దేవుడు అందరికీ తెలుసు. కానీ ఆ దేవుడి గురించి చాలా మందికి తెలియని విషయాలను ఆధారంగా చేసుకుని త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ రాస్తున్నట్టు నాగవంశీ చెప్పారు. ఆయన చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మ్యాడ్ స్వ్కేర్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ గనక హిట్ అయితే మూడో పార్టు కూడా తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక బన్నీ, త్రివిక్రమ్ సినిమా ఎప్పుడు మొదలవుతుంది అనేది మాత్రం క్లారిటీ రాలేదు.