NTV Telugu Site icon

Naga Shaurya: దేవుడా.. నాగ శౌర్య అంత కట్నం తీసుకున్నాడా..?

Ns

Ns

Naga Shaurya: కుర్ర హీరో నాగ శౌర్య ఎట్టకేలకు ఒక ఇంటివాడు అయ్యాడు. బెంగుళూరుకు చెందిన అనూష శెట్టితో నిన్ననే ఏడడుగులు వేసి కర్ణాటక అల్లుడిగా మారిపోయాడు. అనూష గురించి చెప్పాలంటే.. ఆమె ఒక బిజినెస్ విమెన్. ఇంటీరియర్ డిజైనర్ గా అవార్డు కూడా అందుకొంది. ఇక ఈ జంట ప్రేమ వ్యవహారం పెళ్లి వరకు వచ్చేవరకు యంగ్ హీరో చాలా సీక్రెట్ గా ఉంచాడు. ఇక ఎలా అయితే పెళ్లి అయిపోయింది. ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ జంట కొన్ని పూజలు చేస్తూ బిజీగా ఉన్నారు. పెళ్లి అని తెలిసిన దగ్గరనుంచి నాగ శౌర్య కట్నం ఎంత తీసుకున్నాడు..? అమ్మాయి వాళ్ళు ఆస్తులు ఏం ఇచ్చారు..? అని సోషల్ మీడియాలో ఒకటే రచ్చ.

కాగా, సోషల్ మీడియా కథనాల ప్రకారం నాగ శౌర్య 40 నుంచి 50 కోట్లు దాకా నుండి నాగశౌర్యకు కట్నం వచ్చినట్లు తెలుస్తోంది. అనూష రెడ్డి ఆస్తులు కూడా బాగానే ఉండడంతో శౌర్య మామగారు వాటిని కూడా అల్లుడి పేరు మీద రాసేశారట. ఇక మరికొంతమంది ఈ కట్నం గురించి కూడా చర్చలు పెడుతున్నారు. నాగ శౌర్య రెండు, మూడు సినిమాలు చేస్తే వచ్చే ఆదాయాన్ని కట్నంగా తీసుకున్నాడు అంటే నమ్మబుద్ది కావడం లేదని కొందరు, ప్రేమ పెళ్లి కాబట్టి అసలు కట్నమే తీసుకోలేదని మరికొందరు చెప్పుకొస్తున్నారు. ఇందులో నిజం ఎంత ఏంటి అనేది వారికే తెలియాలి.