NTV Telugu Site icon

Akkineni Controversy: బాలయ్య వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందించిన నాగచైతన్య

Naga Chaitanya

Naga Chaitanya

Akkineni Controversy: వీరసింహారెడ్డి విజయోత్సవ సభలో హీరో నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. అక్కినేని తొక్కినేని అంటూ బాలయ్య వ్యాఖ్యానించడం అక్కినేని అభిమానులను తీవ్రంగా హర్ట్ చేసింది. దీంతో సోషల్ మీడియాలో బాలయ్యను నెటిజన్‌లు ట్రోల్ చేస్తున్నారు. ఈ వివాదంపై తాజాగా అక్కినేని నాగచైతన్య కూడా స్పందించాడు. నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, ఎస్వీ రంగారావు తెలుగు తల్లి కళామతల్లి ముద్దుబిడ్డలు అని.. వారిని అగౌరవపరచడం అంటే మనల్ని మనం కించపరుచుకోవడమేనని అక్కినేని నాగచైతన్య సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. ఈ పోస్టునే హీరో అఖిల్ కూడా షేర్ చేశాడు.

Read Also: Maruti Suzuki: 11వేల గ్రాండ్ విటారా కార్‌లు రీకాల్.. కారణం ఇదే..

కాగా వీరసింహారెడ్డి విజయోత్సవంలో భాగంగా బాలకృష్ణ దాదాపు అరగంటకు పైగా స్పీచ్ ఇచ్చాడు. ఈ స్పీచ్ ఇస్తున్న సమయంలో ఆర్టిస్టులు, టెక్నీషియన్లు, నిర్మాత, దర్శకులతో పాటు గెస్టులుగా వచ్చిన ఇతర హీరోలు, దర్శకులు సైతం వేదికపై ఉన్నారు. అయితే ఆర్టిస్టులను టెక్నీషియన్లను అందరినీ అభినందించిన తర్వాత నిర్మాతలను, కొందరు నటులను అభినందించే సమయంలో అందరూ అద్భుతంగా నటించారని.. వీరితో తనకు చక్కని టైంపాస్ అయిందని చెప్తూ.. నాన్న గారి డైలాగులు, ఆ రంగారావు గారు, ఈ అక్కినేని తొక్కినేని అంటూ అన్ని కూడా మాట్లాడుకుంటూ ఉండేవాళ్లం అంటూ బాలయ్య కామెంట్ చేశాడు. పాతకాలం నటులను, ఆ డైలాగులను నెమరు వేసుకునే సంగతి మంచిదే అయినా.. బాలయ్య మాట్లాడుతున్న ఫ్లోలో అక్కినేని.. తొక్కినేని అనడం వివాదాస్పదంగా మారింది. దీంతో సోషల్ మీడియాలో ఆయన వ్యాఖ్యలు రచ్చ రేపుతున్నాయి.