Site icon NTV Telugu

సమంత ఫ్రెండ్ తో నాగ చైతన్య..?

naga chaitanya

naga chaitanya

అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మరీనా సంగతి తెలిసిందే. ఇప్పటికే విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో థాంక్యూ మూవీ, దూత అనే వెబ్ సిరీస్ చేస్తున్నాడు.. ఇక ఇవి సెట్స్ మీద ఉండగానే తమిళ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక ఈ నేపథ్యంలోనే మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. టాలీవుడ్ లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో నాగ చైతన్య నటిస్తున్నాడని వార్తలు గుప్పుమన్నాయి. నందిని రెడ్డి, సమంతకు మంచి ఫ్రెండ్ అన్న విషయం అందరికి తెలిసిందే. వీరిద్దరి కాంబోలో ఓ బేబీ లాంటి హిట్ సినిమా వచ్చింది.

ఇక అప్పుడెప్పుడో చై- సామ్ కలిసి ఉన్నప్పుడు నందిని ఒక కథ చెప్పడం, దాన్ని ఈ జంట కలిసి చేయాలనుకోవడం జరిగిందని వార్తలు వినిపించాయి. ఆ తరువాత సామ్- చై విడిపోవడంతో నందిని రెడ్డి ఆశలు అడియాశలు అయిపోయాయి అనుకున్నారు. అయితే ఎట్టకేలకు ఆ కథనే చైతూ కి వినిపించి ఓకే చేయించిందట.. ఇక కథ నచ్చడంతో చైతూ కూడా కాదనలేకపోయాడని టాక్.. ఈ సినిమాను వైజయంతీ మూవీస్ పతాకంపై స్వప్న దత్ నిర్మిస్తుందని సమాచారం. మరి ముందు అనుకున్నట్లు ఈ సినిమాలో నందిని, హీరోయిన్ గా సమంతను తీసుకుంటుందా..? లేక సమంత ప్లేస్ లో మరో హీరోయిన్ ని రీప్లేస్ చేస్తుందో చూడాలి.

Exit mobile version