Nagachithanya : నాగచైతన్య వరుస ప్లాపుల తర్వాత కరెక్ట్ దారిలో వెళ్తున్నాడు. రీసెంట్ గానే తండేల్ తో భారీ హిట్ అందుకున్నాడు. ఇప్పుడు విరూపాక్ష డైరెక్టర్ కార్తీక్ దండుతో కలిసి మైథికల్ థ్రిల్లర్ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు. ఈ మూవీని ప్రకటించి చాలా నెలలు గడిచిపోయింది. కానీ షూటింగ్ ఇంకా స్టార్ట్ కాలేదు. అయితే ఇంత ఆలస్యం ఎందుకు అయిందో చెబుతూ ఓ వీడియోను రిలీజ్ చేసింది మూవీ టీమ్. ఈ వీడియోలో సినిమా కోసం భారీ సెట్స్ వేసేశారు. అడవులు, గుట్టలు, కొండలు, గుహల్లో రీసెర్చ్ చేస్తున్నారు. ఎక్కువగా గుహల్లాంటి ప్రాంతంలోనే ఈ సినిమా షూటింగ్ జరగబోతున్నట్టు తెలుస్తోంది. ఈ వీడియోలో వాటినే ఎక్కువగా చూపించారు.
Read Also : Chennai Super Kings : చెన్నైకి అసలు విలన్ అతడేనా?
వీఎఫ్ ఎక్స్ ను కూడా భారీగా వాడుతున్నట్టు తెలుస్తోంది. దానికి సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. మొత్తానికి ఏదో పెద్ద స్క్రిప్ట్ ను రెడీ చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఎవరూ ఊహించిన మైథికల్ థ్రిల్లర్ ను రెడీ చేస్తున్నట్టు వీడియోలు చూపించారు. ఇందులో ఓ పెద్ద మిస్టరీని చూపించే వ్యక్తిగా నాగచైతన్య కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. కానీ మూవీ గురించి చిన్న క్లూ కూడా ఇవ్వలేదు. ఈ సినిమాకు వృషకర్మ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. త్వరలోనే మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాబోతోంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. విరూపాక్షతో ఇండస్ట్రీని షేక్ చేసిన కార్తీక్ దండు.. ఈ సినిమాతో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి.