Site icon NTV Telugu

సమంతతో రొమాన్స్ చేయడం ఇష్టం- నాగ చైతన్య

chay-sam

chay-sam

అక్కినేని నాగ చైతన్య- సమంత విడాకులు తీసుకున్నాకా ఇప్పటివరకు చైతూ సామ్ గురించి మాట్లాడింది లేదు. లవ్ స్టోరీ ప్రమోషన్స్ లో కానీ, వేరే ఇంటర్వ్యూలలో కానీ సామ్ పేరును తీయకుండా ఉండేలాజాగ్రత్త పడ్డాడు. అయితే ఇటీవల చై లో కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి . బంగార్రాజు ప్రమోషనలలో భాగంగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలపై ఓపెన్ అయ్యాడు. మొదటిసారి సామ్ తో విడాకుల గురించి చెప్పుకొచ్చాడు. అది ఇద్దరి బెస్ట్ డెసిషన్ అని తెలిపి శాఖ కి గురిచేసిన చైతన్య మరోసారి సామ్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసి హాట్ టాపిక్ గా మారాడు. ప్రస్తుతం చైతు లాల్ సింగ్ చద్దా చిత్రంతో బాలీవుడ్ డెబ్యూ ఇస్తున్న సంగతి తెలిసిందే.

అమీర్ ఖాన్, కరీనాకపూర్ ఖాన్ జంటగా ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ కి హాజరు అయిన చైతూకి ” మీ ఉత్తమ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఎవరు..? అని ప్రశ్న ఎదురైంది. దానికి చైతు తడుముకోకుండా సమంత పేరు చేపట్టడం హాట్ టాపిక్ గా మారింది. ఏ మాయ చేశావే దగ్గర నుంచి మజిలీ వరకు వీరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అదిరిపోతోంది. సామ్ తో నేను చాలా కంఫర్టుబుల్ గా ఫీల్ అవుతాను అని చై చెప్పుకోచ్చాడు. ఇక సామ్ కాకుండా ఇంకెవరు అనుకుంటున్నారు అంటే బాలీవుడ్ లో అలియా భట్, దీపికా పదుకొనే తో నటించడం ఇష్టం అని చెప్పుకొచ్చాడు,. ఏదిఏమైనా ఇన్నిరోజులు తరువాత మాజీ భార్య గురించి చైతు మాట్లాడడం ఆశ్చర్యంగా ఉందంటూ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

Exit mobile version