గత కొన్నిరోజుల నుంచి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పెళ్లిపై పుకార్లు షికార్లు చేస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠితో వరుణ్ ప్రేమలో ఉన్నాడని, ఇరు కుటుంబాలు ఒప్పుకోవడంతో త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలు ఎక్కనున్నారని వార్తలు గుప్పుమన్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే ఈ వార్తలపై లావణ్య అహరహం వ్యక్తం చేసింది. ఆ వార్తల్లో నిజం లేదని ఇన్ డైరెక్ట్ గా ట్రోలర్స్ కి వార్నింగ్ కూడా ఇచ్చింది. ఇక మరోపక్క వరుణ్ తండ్రి నాగబాబు సైతం వరుణ్ పెళ్లిపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం ఇంకా ఆసక్తిగా మారింది.
గతంలో కూడా ఆయన మాట్లాడుతూ” వరుణ్ కి పెళ్లి సంబంధాలు చూస్తున్నాం.. మంచి సంబంధం ఉంటే మీరు కూడా చెప్పొచ్చు అని నెటిజన్స్ కి కూడా చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా అతడు ఎవరిని ప్రేమించినా తమకేమి అభ్యంతరం లేదని చెప్పుకొచ్చాడు. ఇక తాజాగా మరోసారి వరుణ్ పెళ్లి గురించి ఒక నెటిజన్ అడిగిన ప్రశ్నకు సైతం అదే ఆన్సర్ ఇవ్వడం విశేషం. వరుణ్ ఎవరిని ప్రేమించి నా తమకేమి అభ్యంతరం లేదని, ఆ మ్మాయిని ఇంటికి తీసుకొచ్చి తమకు చెప్తే… వెంటనే పెళ్లి చేస్తాం అంటూ చెప్పుకొచ్చారు. ఏదిఏమైనా కొడుకు పెళ్లిపై నాగబాబు చాలా క్లారిటీగా ఉన్నట్లు తెలుస్తోంది. మరి వరుణ్ ప్రేమ పెళ్లి చేసుకుంటాడా..? పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటాడా..? అనేది చూడాలి. ప్రస్తుతం వరుణ్ గని సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.