Site icon NTV Telugu

Nag Ashwin : X-లైఫ్‌ ఎడిట్ చేస్తే నాగ్ అశ్విన్ వద్ద ఎడిటర్ ఛాన్స్

Nag Ashwin

Nag Ashwin

దర్శకుడు నాగ్ అశ్విన్ అప్ కమింగ్ ఎడిటర్స్ కి బిగ్ ఆఫర్ ఇచ్చాడు. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’తో ఆకట్టుకుని ‘మహానటి’ క్రేజీ డైరక్టర్ గా మారిన నాగ్ అశ్విన్ అప్ కమింగ్ ఎడిటర్స్ కి సువర్ణ అవకాశం అంటూ తన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం ప్రభాస్, దీపిక ప్రధాన పాత్రల్లో సైంటిఫిక్ ఫిక్షన్ ‘ప్రాజెక్ట్ కె’ పనుల్లో బిజీగా ఉన్న నాగ్ అశ్విన్ ఔత్సాహిక ఎడిటర్స్ కి జాబ్ ఆఫర్ ప్రకటించాడు. గతేడాది నెట్‌ఫ్లిక్స్ ఆంథాలజీ ‘పిట్ట కథలు’ కోసం ‘ఎక్స్-లైఫ్’ ఎపిపోడ్ కి దర్శకత్వం వహించాడు నాగ్. ఇప్పుడు దానికి సంబంధించి ఆసక్తికరమైన ప్రోమో కట్ చేసి పంపాటలని, అలా ప్రోమోతో ఆకట్టుకున్న ఔత్సాహిక ఎడిటర్స్ కి తమ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ఎడిటింగ్ డిపార్ట్ మెంట్ లో ఉద్యోగం దక్కుతుందని చెబుతున్నాడు. నాగ్ అశ్విన్ ‘నెట్‌ఫ్లిక్స్‌లో ‘ఎక్స్ లైఫ్‌’లో నా పిట్టకథ గుర్తుంది కదా….దానికి సంబంధించి 2 నిమిషాల ఎడిట్ కట్ రెడీ చేయండి. అత్యుత్తమ కట్ చేసిన వారికి వైజయంతి సంస్థలో ప్రోమో విభాగంలో మీరు ఎడిటర్ ఎడిట్ అయిపోయినట్లే. అదృష్టాన్ని పరీక్షించుకోండి. ఆల్ ది బెస్ట్’ అని సోషల్ మీడియా ట్విట్టర్ లో ట్వీట్ చేశాడు నాగ్ అశ్విన్. మరి ఆలస్యం ఎందుకు ఔత్సాహిక ఎడిటర్స్… బెస్ట్ కట్ చేసి నాగ్ అశ్విన్ ని ఇంప్రెస్ చేయండి. ఎడిటర్ గా అవకాశం పట్టండి. ఆల్ ద బె్స్ట్.

Exit mobile version