Site icon NTV Telugu

Project K : మహీంద్రా రీసెర్చ్ వ్యాలీలో నాగ్ అశ్విన్

Nag-ashwin

యంగ్ అండ్ టాలెంటెడ్ టాలీవుడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ప్రస్తుతం తన కొత్త మూవీ “ప్రాజెక్ట్ కే” షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. “ప్రాజెక్ట్ కే”లో ప్రభాస్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా నాగ్ అశ్విన్ గ్లోబల్ ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ చీఫ్ వేలుతో కలిసి చెన్నైలోని మహీంద్రా రీసెర్చ్ వ్యాలీని సందర్శించారు. తరువాత ఆ ఫోటోలను దర్శకుడు ట్వీట్ చేస్తూ “ఎంత అందమైన క్యాంపస్… ఇక్కడ ప్రకృతి అత్యాధునిక సాంకేతికతను కలుస్తుంది… వేలు అండ్ టీంతో మా ప్రయాణానికి ఫలవంతమైన ప్రారంభం.. చాలా ధన్యవాదాలు ఆనంద్ మహీంద్రా సర్” అంటూ ట్వీట్ చేశాడు.

Read Also : Vikram Release Date : మేకింగ్ వీడియోతో అనౌన్స్మెంట్

మార్చి 2022 మొదటి వారంలో దర్శకుడు నాగ అశ్విన్… మహీంద్రా గ్రూప్ CEO ఆనంద్ మహీంద్రా సహాయం కోసం రిక్వెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సినిమాని అద్భుతంగా రూపొందించడంలో సహాయం కోరారు. ఆనంద్ మహీంద్రా స్పందిస్తూ ఖచ్చితంగా సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ మూవీని వైజయంతీ మూవీస్ భారీ స్థాయిలో నిర్మిస్తోంది. 2023లో విడుదల కానున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారు.

Exit mobile version