Dhurandhar 2: పాపం…. ధురంధర్ 2 దెబ్బకి వణికిపోతున్న పాక్ లీడర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ సీనియర్ నాయకుడు నబీల్ గబోల్ ఇప్పుడు ఒక వింతైన చిక్కుల్లో పడిపోయారు, మొన్నటి వరకు ఒక సినిమా పాత్రను తనదేనని గర్వంగా చెప్పుకున్న ఈ రాజకీయ నాయకుడు, ఇప్పుడు అదే పాత్ర తనది కాదని చెబుతూనే మరోపక్క హడలిపోతున్నారు. దీనికంతటికీ కారణం ఇటీవల విడుదలైన ‘ధురంధర్ 2’. ‘ధురంధర్’ మొదటి భాగం విడుదలైనప్పుడు, అందులోని క్యారెక్టర్ ‘జమీల్ జమాలీ’ తన జీవితం ఆధారంగానే రూపొందించబడిందని నబీల్ గబోల్ గట్టిగా ప్రచారం చేసుకున్నారు. టీవీ ఇంటర్వ్యూలలో కూడా చాలా సిగ్గుపడుతూ.. “అవును, జనం ఇప్పుడు నన్ను నబీల్ అని కాకుండా జమీల్ జమాలీ అని పిలుస్తున్నారు” అంటూ తెగ మురిసిపోయారు. తన పాపులారిటీ పెరిగిందని భావించిన ఆయన, ఆ సినిమా సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేశారు.
Also Read : Sundeep Kishan: సందీప్ కిషన్‌తో ‘శంబాల’ డైరెక్టర్ సినిమా
Also Read
- Anil Ravipudi: దీపూని పరిచయం చేసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ఇంతకీ ఎవరో తెలుసా?
- Raaka : ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డు బద్దలుకొట్టిన అల్లు అర్జున్-అట్లీ!
- Ameesha Patel: ఫస్ట్ డే కలెక్షన్ల కంటే హీరోయిన్ల ప్రమోషన్‌కే ఖర్చే ఎక్కువ! అసలు బండారం బయటపెట్టిన అమీషా పటేల్..
- Irumudi : రూ.250 కోట్ల క్లబ్లో రవితేజ.. ఓటీటీని సైతం షేక్ చేస్తున్న ‘ఇరుముడి’!
అయితే, తాజాగా విడుదలైన ‘ధురంధర్ 2’ చూశాక నబీల్ గబోల్ పరిస్థితి ఒక్కసారిగా తలకిందులైంది. ఈ సీక్వెల్లో జమీల్ జమాలీ పాత్రకు సంబంధించిన కొన్ని చీకటి కోణాలు, నెగటివ్ షేడ్స్ బయటకు రావడంతో ఆయనలో వణుకు మొదలైంది. ఇప్పుడు ఏ ఇంటర్వ్యూకి వెళ్లినా.. “ఆ సినిమాకు నాకు అసలు సంబంధమే లేదు.. జమీల్ జమాలీ పాత్ర నాది కానే కాదు” అంటూ మొత్తుకుంటున్నారు. ప్రస్తుతం పాకిస్థాన్ రాజకీయాల్లో ఉన్న గందరగోళ పరిస్థితుల దృష్ట్యా, నబీల్ గబోల్ భయం వెనుక బలమైన కారణమే ఉందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. సినిమా పాత్ర తనదేనని ఆయన గతంలో ఒప్పుకోవడంతో, ఇప్పుడు పాక్ ఆర్మీ మరియు అక్కడి నిఘా సంస్థలు ఆయనపై కన్నేసినా కన్నేయచ్చని కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అక్కడి అడ్మినిస్ట్రేషన్ ఆయనను అదుపులోకి తీసుకుని గట్టిగా విచారించే అవకాశం ఉందని సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. మొత్తానికి, ఒక సినిమా పాత్రను క్రెడిట్ కోసం తనదిగా చెప్పుకుని, ఇప్పుడు అదే పాత్ర వల్ల తన ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు నబీల్ గబోల్.
తాజావార్తలు
-
Trump-Media: వార్తా సంస్థలను ‘కేన్సర్’తో పోల్చిన ట్రంప్.. కోర్టుకెళ్లనున్న మీడియా సంస్థలు
-
CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
-
Ponguleti: పేదోడి ఆత్మగౌరవమే ఇందిరమ్మ టవర్స్ లక్ష్యం
-
Gummanur Jayaram: ‘రెబల్‌గా వేస్తే సినిమా చూపిస్తా..!’.. టీడీపీ నేతలకు ఎమ్మెల్యే గుమ్మనూరు సీరియస్ వార్నింగ్..
-
Anil Ravipudi: దీపూని పరిచయం చేసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ఇంతకీ ఎవరో తెలుసా?
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!