టాలీవుడ్ లో బెస్ట్ డాన్సర్లు ఎవరు అంటే టక్కున రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ అని లైన్ చదివేస్తూ ఉంటారు.ఒక సినిమాలో ఒక హీరో డాన్స్ చేస్తుంటూనే ఊగిపోతూ ఉంటాం. మరి ఇద్దరు స్టార్ హీరోలు.. అందులోను ఇద్దరు బెస్ట్ డాన్సర్లు ఒకే ఫ్రేమ్ లో డాన్స్ చేస్తూ కనిపిస్తే.. చూడడానికి రెండు కళ్లు చాలవు.. ప్రస్తుతం ప్రేక్షకులందరూ అలాంటి తన్మయ పరిస్థితిలోనే ఉన్నారు. ఎందుకంటే.. ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు వీడియో సాంగ్ రిలీజ్ అయ్యింది కాబట్టి.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మార్చి 25 న రిలీజ్ అయ్యి 1000 కోట్లు రాబట్టిన సంగతి తెల్సిందే. ఇక ఈ చిత్రంలో చరణ్, తారక్ డాన్స్ తో అదరగొట్టిన నాటు నాటు సాంగ్ ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ఈ పాటను రీక్రియేట్ చేసేశారు అభిమానులు.
ఇక తాజాగా ఈ మాస్ యాంథమ్ వీడియో సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇక ఈ సాంగ్ లో ఎన్టీఆర్, చరణ్ ల డాన్స్ ను చూస్తూ ప్రేక్షకులు మైమర్చిపోతున్నారు అతిశయోక్తి కాదు. ఇద్దరు స్టార్ హీరోలు అలా డాన్స్ చేస్తుంటే చూడడానికి రెండు కళ్లు చాలడం లేదంటున్నారు అభిమానులు. బ్రిటిష్ వారి ముందు తెలుగు నాటును చూపించి మెప్పించారు. ఈ సాంగ్ కోసం రాజమౌళి ఎంతో కష్టపడినట్లు తెలిపారు. ఈ సాంగ్ కోసం మేము పడ్డ కష్టం అంతా ఇంతా కాదని చరణ్, తారక్ ఇంటర్వ్యూలో చెప్పిన విషయం తెల్సిందే. ఇప్పుడు ఈ సాంగ్ చూస్తుంటే వారు చెప్పినదాంట్లో ఆశ్చర్యం లేదని తెలుస్తోంది. ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ చేసిన ఈ సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్ ను షేక్ ఆడిస్తోంది. మరి ఈ సాంగ్ ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.
https://www.youtube.com/watch?v=OsU0CGZoV8E
