Naa Saami Ranga: నాగ్ ఈసారి.. హిట్ ను ఎత్తికెళ్లిపోవడం ఖాయంలా అనిపిస్తుందే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Naa Saami Ranga: అక్కినేని నాగార్జున చాలా గ్యాప్ తరువాత హీరోగా నటిస్తున్న చిత్రం నా సామీ రంగా. విజయ్ బిన్నీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి బెజవాడ ప్రసన్న కుమార్ కథను అందిస్తున్నాడు. మలయాళం హిట్ సినిమా పోరింజు మరియమ్ జోస్ సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతోందని వార్తలు వినిపిస్తుంది. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ మధ్యనే ఈ సినిమాలో నటిస్తున్న హీరోయిన్ ఆషికా రంగనాధ్ గ్లింప్స్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. వరలక్ష్మీ అనే పాత్రలో ఆమె కనిపిస్తుందని తెలిపారు. ఇక అచ్చతెలుగు ఆడపడుచులా ఆమె లుక్ అందరిని ఆకట్టుకుంది. ఇక తాజాగా ఈ సినిమా నుంచి మొదటి సాంగ్ రిలీజ్ కు ముహూర్తం ఖరారు చేశారు.
ఎత్తుకెళ్ళిపోవాలనిపిస్తుందే అంటూ సాగే ఈ సాంగ్ ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇక ఇందులో నాగ్ విలేజ్ లుక్ లో ఆకట్టుకుంటున్నాడు. సోగ్గాడే చిన్ని నాయనలో బంగార్రాజు లా కనిపిస్తున్నాడు. ఇక చంద్రబోస్ రాసిన లిరిక్స్ క్రేజీగా ఉన్నాయి. ఆస్కార్ అవార్డు విన్నర్ కీరవాణి సంగీతం అందించిన ఈ సాంగ్ ను రామ్ మిరియాల తన అద్భుతమైన వాయిస్ తో ఆలపించాడు. విజువల్స్ కూడా బాగా ఆకట్టుకుంటున్నాయి. పల్లెటూరి వాతావరణంలో చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఇక ఈ ఫుల్ సాంగ్ ను డిసెంబర్ 10 న రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. సాంగ్, విజువల్స్ .. నాగ్ లుక్ చూస్తుంటే.. ఈ సినిమా హిట్ అయ్యేలానే కనిపిస్తుందని అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరి ఈ సినిమాతో నాగ్ ఎలాంటి విజయం అందుకుంటాడో చూడాలి.
Also Read
- ప్రముఖ నటుడు జాతీయ అవార్డు గ్రహీత కన్నుమూత
- Spirit : 'స్పిరిట్' ఇంటర్నేషనల్ అన్నారు కదా.. మరి లోకల్ లోనే చుట్టేస్తున్నారేంటి?
- SlumDog – 33 Temple Road: 'స్లమ్‌డాగ్ – 33 టెంపుల్ రోడ్' కు డబ్బింగ్ చెప్పిన విజయ్ సేతుపతి... టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
- Anasuya: బాధ్యత ఉండక్కర్లా.. బుచ్చిబాబు'కి అనసూయ పరోక్ష కౌంటర్?
తాజావార్తలు
-
Mohali Office Murder: ఆ కారణంతోనే చంపాడు.. మొహాలి ఘటన చెప్పిన చేదు నిజం!
-
ప్రముఖ నటుడు జాతీయ అవార్డు గ్రహీత కన్నుమూత
-
Spirit : ‘స్పిరిట్’ ఇంటర్నేషనల్ అన్నారు కదా.. మరి లోకల్ లోనే చుట్టేస్తున్నారేంటి?
-
NEET UG 2026: నీట్ రీ-ఎగ్జామ్ కు ముందు.. పేపర్ లీక్ వదంతులపై విద్యార్థులకు ఎన్టీఏ విజ్ఞప్తి..
-
Domestic LPG Cylinder Price Hiked: గృహ వినియోగదారులకు షాక్.. పెరిగిన వంటగ్యాస్ ధరలు.. ఎంతంటే?
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!