Allu Arjun: పార్టీ ఇస్తున్న పుష్ప.. షెకావత్ సారూ కూడా వస్తున్నారట..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. పుష్ప సినిమాకు గాను ఈ ఏడాది నేషనల్ అవార్డు అందుకున్న విషయం తెల్సిందే. ఇప్పటివరకు ఏ టాలీవుడ్ హీరో.. నేషనల్ అవార్డు ను అందుకోకపోవడంతో ఇండస్ట్రీ మొత్తం బన్నీ పేరు మారుమ్రోగిపోతుంది. ఈ మధ్యనే.. ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జాతీయ అవార్డు ను అందుకున్నాడు. నేషనల్ అవార్డ్ ప్రకటించినప్పటి నుంచి బన్నీని అందరు పార్టీ లేదా పుష్ప .. పార్టీ లేదా పుష్ప అంటూ అడిగేస్తున్నారు. ఇక ఆ సమయంలోనే టాలీవుడ్ ప్రముఖులకు వేరుగా.. మీడియా కు వేరుగా బన్నీ పార్టీ ఇచ్చిన విషయం తెల్సిందే. ఇక అవార్డు అందుకున్నాకా.. బన్నీ మామ.. కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గ్రాండ్ గా రిలేటివ్స్ కు పార్టీ ఇచ్చాడు. ఇక ఈ పార్టీ లో బన్నీ స్నేహితులు, బంధువులు కొంతమంది ప్రముఖులు హాజరయ్యారు.
Rana Daggubati: ప్రభాస్ అంటే నాకు అసూయ.. నేను కలగన్న ప్రతిదాన్ని అతడే..
Also Read
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
తాజాగా పుష్ప .. మరో పార్టీకి సిద్దమయ్యాడు. ఈసారి బన్నీ ఇచ్చే పార్టీ కాదు. పుష్పను ఆ రేంజ్ లో నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ ఈ పార్టీని హోస్ట్ చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రం గండిపేట లో ఈ పార్టీ గ్రాండ్ గా జరగనుంది. ఈ వేడుకకు పుష్పకు సంబంధించిన అందరు ప్రముఖులు రానున్నారు. అంతేకాకుండా జాతీయ అవార్డులు వచ్చిన తెలుగు ప్రముఖులు అందరూ పాల్గొంటారు. ముఖ్యంగా మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ కూడా రానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో బన్నీ క్యారెక్టర్ అంతగా ఎలివేట్ అయ్యింది అంటే .. విలన్ గా ఫహద్ చూపిన క్రూరత్వమే అని చెప్పాలి. భన్వర్ సింగ్ షెకావత్ గా ఫహద్ నటనకు తెలుగువారు ఫిదా అయ్యిపోయారు. ఇక ఈ సినిమాలో పార్టీ లేదా పుష్ప అనే డైలాగ్ తో ఫేమస్ అయిన ఫహద్.. ఆ పార్టీ తీసుకోవడానికి వస్తున్నాడు. రేపు ఈ పార్టీ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తాయేమో చూడాలి.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!