Site icon NTV Telugu

Ustad Bhagat Singh : అలా చేస్తే చట్టపరమైన చర్యలు.. వాళ్లకు ‘మైత్రీ’ వార్నింగ్..

Ustad

Ustad

Ustad Bhagat Singh : బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వరుస సినిమాలతో బిజీగా ఉంది. వాళ్లు పవన్ కల్యాణ్‌ తో నిర్మిస్తున్న మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. చాలా గ్యాప్ తర్వాత షూట్ రీ స్టార్ట్ చేశారు. హరీశ్ శంకర్ డైరెక్షన్ లో మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ షూటింగ్ లొకేషన్ నుంచి కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అఫీషియల్ గా ప్రకటించక ముందే.. చాలా పిక్స్, షూటింగ్ అప్డేట్లు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. దీంతో మైత్రీ సంస్థ తాజాగా దీనిపై రియాక్ట్ అయింది. మేం ఈ నడుమ కొన్ని పోస్టులు ఉస్తాద్ భగత్ సింగ్ గురించి సోషల్ మీడియాలో చూస్తున్నాం. మీ ఉత్సాహం మాకు అర్థమైంది. మేం ది బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం. కాబట్టి అందరూ దీన్ని అర్థం చేసుకోవాలి.

Read Also : HHVM : ప్రీమియర్ షోలు.. వీరమల్లుకు కలిసొస్తాయా..?

అలా కాకుండా ఇక నుంచి ఎవరైనా లీకులు చేసినా, మూవీ గురించి ముందే ఇన్ఫర్మేషన్ పోస్టు చేసినా మేం యాక్షన్ తీసుకుంటాం అంటూ తెలిపింది. ఈ పోస్టు కాస్త ఇప్పుడు వైరల్ అవుతోంది. పవన్ ఫ్యాన్స్ ఏ చిన్న అప్డేట్ లేదా లీకు కనిపించినా దాన్ని వైరల్ చేసేస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్‌ ఇప్పుడు ఓజీతో పాటు ఉస్తాద్ షూటింగులతో బిజీగా ఉంటున్నాడు. ఓ వైపు హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ కు రెడీ అవుతోంది. రేపు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండబోతోంది. దానికి చీఫ్‌ గెస్టుల సంఖ్య పెద్దగానే ఉంది. ఇంకోవైపు పవన్ కల్యాణ్‌ చేస్తున్న ఓజీ షూటింగ్ అయిపోవడానికి వచ్చింది.

Read Also : Raashi Khanna : పవన్ పక్కన ఛాన్స్ కొట్టేసిన ప్లాపుల హీరోయిన్..

Exit mobile version